ఏపీ పంచాయితీ ఎన్నికలు... రికార్డు స్థాయిలో నామినేషన్లు నమోదు

 నిన్న శనివారం ఒక్కరోజే సర్పంచ్ ల కోసం 8773 మంది నామినేషన్లు దాఖలు కాగా వార్డు సభ్యుల కోసం 25,519 మంది నామినేషన్లు వేశారు.
 

AP Panchayat Elections Update

అమరావతి:  రాష్ట్రంలో గడిచిన రెండు రోజులుగా పంచాయితీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈనెల 29వ తేదీన మొదటిరోజు సర్పంచ్ ల కోసం 1315 మంది నామినేషన్లు వేసినట్లు ఎస్ఈసీ తెలిపింది. అలాగే అదేరోజు వార్డు సభ్యుల కోసం 2,200 మంది నామినేషన్లు దాఖలు చేశారు. ఇక నిన్న(శనివారం) 30వ తేదీన సర్పంచ్ ల కోసం 8773 మంది నామినేషన్లు దాఖలు కాగా వార్డు సభ్యుల కోసం 25,519 మంది నామినేషన్లు వేశారు.

మొదటి విడతలో ఎన్నికలు జరగనున్న పంచాయితీల్లో నామినేషన్లు వేయడానికి ఈరోజు(ఆదివారం) ఫిబ్రవరి ఆఖరి రోజు. దీంతో ఇవాళ అత్యధికంగా నామినేషన్లు నమోదయ్యే అవకాశాలున్నాయి. దీంతో అందుకు తగినట్లు ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు.  

read more  వైసీపీకి ఊరట, చంద్రబాబుకి షాక్: టీడీపీకి నిమ్మగడ్డ నోటీసులు

ఇక విజయనగరం జిల్లాలో నేడు గ్రామ పంచాయితీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు అధికారులు. రెండు డివిజన్లలో కలిపి మూడు విడతల్లో పంచాయితీ ఎన్నికలు చేపట్టనున్నారు.మొదటి విడతగా పార్వతీపురం డివిజన్లో 15 మండలాల పరిధిలో415 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 2 నుండి 4 వరకు ఎన్నికల నామినేషన్ ప్రక్రియ, 13 వ తేదీన ఎన్నిక జరగనుంది.

ఇక రెండో విడతగా విజయనగరం డివిజన్లో 9 మండలాల పరిధిలో 248 గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 6 నుండి 8 వరకు ఎన్నికల నామినేషన్ ప్రక్రియ, 17 వ తేదీన ఎన్నిక జరగనుంది.  మూడో విడతగా విజయనగరం డివిజన్లో మిగిలిన 10 మండలాల పరిధిలో 296 గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 10 నుండి 12 వరకు ఎన్నికల నామినేషన్ ప్రక్రియ, 21 వ తేదీన ఎన్నిక జరగనుంది. 
 

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios