Asianet News TeluguAsianet News Telugu

వైసీపీకి ఊరట, చంద్రబాబుకి షాక్: టీడీపీకి నిమ్మగడ్డ నోటీసులు

తెలుగుదేశం పార్టీకి ఎస్ఈసీ నోటీసులు జారీ చేశారు. పంచాయతీ ఎన్నికలకు మేనిఫెస్టో విడుదల చేయడంపై ఈసీకి వైఎస్సార్ కాంగ్రెస్ ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. దీనిని పరిగణనలోనికి తీసుకున్న ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ టీడీపీకి నోటీసులు జారీ చేశారు. 

ap sec nimmagadda ramesh kumar issued notices to tdp ksp
Author
Amaravathi, First Published Jan 30, 2021, 8:19 PM IST

తెలుగుదేశం పార్టీకి ఎస్ఈసీ నోటీసులు జారీ చేశారు. పంచాయతీ ఎన్నికలకు మేనిఫెస్టో విడుదల చేయడంపై ఈసీకి వైఎస్సార్ కాంగ్రెస్ ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. దీనిని పరిగణనలోనికి తీసుకున్న ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ టీడీపీకి నోటీసులు జారీ చేశారు.

ఫిబ్రవరి 2లోగా వివరణ ఇవ్వాలని టీడీపీని ఆదేశించారు. గడువులోగా వివరణ ఇవ్వని పక్షంలో తగిన నిర్ణయం తీసుకోవాల్సి వస్తుందని ఈసీ హెచ్చరించింది. 

కాగా, పంచాయతీ ఎన్నికలకు చంద్రబాబు మేనిఫెస్టో విడుదల చేయడంపై ఎస్ఈసీకి వైసీపీ లీగల్ సెల్ కార్యదర్శి సాయిరామ్ ఫిర్యాదు చేశారు. ఎన్నికల నియమావళికి  విరుద్దంగా చంద్రబాబు మేనిఫెస్టో విడుదల చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

Also Read:పంచాయతీ ఎన్నిలపై టీడీపీ మేనిఫెస్టో: చంద్రబాబుపై వైసీపీ ఫిర్యాదు

చంద్రబాబుపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఎస్ఈసీని కోరారు. ఎన్నికల నియామవళికి విరుద్దంగా వ్యవహరించిన చంద్రబాబుపై చర్యలు తీసుకోకుంటే..చంద్రబాబు పక్షపాతిగా ఉన్నారన్న ఆరోపణలు నిజమవుతాయని ఫిర్యాదులో వైసీపీ పేర్కొంది.

పంచాయతీ ఎన్నికలు కొవిడ్ వ్యాక్సినేషన్ తరువాత జరపాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నా దానిని కాదని వివాదాస్పదంగా ఏకపక్షంగా నిర్ణయం తీసుకొని ఎన్నికలు జరిపి ఇస్తుండడం విచారకరమని లేఖలో పేర్కొన్నారు.

అందులోనూ మీకు సంక్రమించని అధికారాలను వినియోగిస్తూ రాష్ట్ర ప్రభుత్వాన్ని శత్రువుల పరిగణిస్తున్న మీరు చంద్రబాబు మీద, ఆయన పార్టీ మీద చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.  

Follow Us:
Download App:
  • android
  • ios