ఏపీ పంచాయితీ ఎన్నికలు... చివరికోజు రికార్డు స్థాయిలో నామినేషన్లు
ఆంధ్ర ప్రదేశ్ లో మొదటి విడత పంచాయితీ ఎన్నికలు జరిగే స్థానాల్లో చివరిరోజు అన్ని జిల్లాల్లో అత్యధికంగా నామినేషన్లు దాఖలయ్యాయి.
విజయవాడ: రాష్ట్రవ్యాప్తంగా తొలివిడత పంచాయితీ ఎన్నికల నామినేషన్ల పర్వం నిన్నటితో(ఆదివారం) ముగిసింది. చివరిరోజు ఏపీలోని అన్ని జిల్లాల్లో అత్యధికంగా నామినేషన్లు దాఖలయ్యాయి. ఇలా కృష్ణా జిల్లాలో కూడా చివరి రోజు సర్పంచ్ స్థానానికి 871 మంది, వార్డు మెంబర్లు గా 5531మంది నామినేషన్లు దాఖలు చేసినట్లు కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ఏ.యండి.ఇంతియాజ్ తెలిపారు. మొత్తంగా ఇప్పటివరకు శుక్ర, శని, ఆదివారం (మూడు రోజులు) తో కలిపి సర్పంచ్ స్థానానికి మొత్తం 1379 మంది, వార్డు మెంబర్ కొరకు 7889 నామినేషన్లు దాఖలు కావడం జరిగిందని... నామినేషన్ల ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో కొనసాగిందని కలెక్టర్ పేర్కొన్నారు.
విజయవాడ రూరల్ మండలంలోని 9 గ్రామాల్లో తొలివిడత పంచాయతీ ఎన్నికల నామినేషన్లు ప్రక్రియ పూర్తయ్యింది. రామవరప్పాడు పంచాయతీకి ఐదుగురు సర్పంచ్ అభ్యర్థులు, 20 వార్డులకు గాను 82 నామినేషన్లు దాఖలు చేశారు. ప్రసాదంపాడు పంచాయతీకి ఏడుగురు సర్పంచ్ అభ్యర్థులు,16 వార్డులకు గాను 42 నామినేషన్లు దాఖలు చేశారు. ఎనికేపాడు పంచాయతీకి ఆరుగురు సర్పంచ్ అభ్యర్థులు ,16 వార్డులకు గాను 74 నామినేషన్లు దాఖలు చేశారు.
read more ఏపీ పంచాయితీ ఎన్నికలు... రికార్డు స్థాయిలో నామినేషన్లు నమోదు
నిడమానూరు పంచాయతీకి 9 మంది సర్పంచ్ అభ్యర్థులు,16 వార్డులకు గాను 88 మంది నామినేషన్లు దాఖలు చేశారు. గూడవల్లి పంచాయతీకి ఐదుగురు సర్పంచ్ అభ్యర్థులు,14 వార్డులకు గాను 35 నామినేషన్లు దాఖలు చేశారు. నున్న పంచాయతీకి 10 మంది సర్పంచ్ అభ్యర్థులు, ,16 వార్డులకు గాను 95 మంది నామినేషన్లు వేశారు.
పాతపాడు పంచాయతీకి నలుగురు సర్పంచ్ అభ్యర్థులు,12 వార్డులకు గాను 36 మంది నామినేషన్లు దాఖలు చేశారు. పి.నైనవరం పంచాయతీకి 5గురు సర్పంచ్ అభ్యర్థులు,10 వార్డులకు గాను 29 మంది నామినేషన్లు దాఖలు చేశారు. అంబాపురం పంచాయతీకి ఏడుగురు సర్పంచ్ అభ్యర్థులు,10 వార్డులకు గాను 41 మంది నామినేషన్లు దాఖలు చేశారు.