Asianet News TeluguAsianet News Telugu

సీఎం జగన్ ఓ సైకో... చెక్ పెట్టే సమయమిదే..: చంద్రబాబు

మొదటి విడత పంచాయితీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా గ్రామాల్లో జరుగుతున్న పరిణామాలను పార్టీ కేంద్ర కార్యాలయానికి ఎప్పటికప్పుడు తెలియచేయాలని చంద్రబాబు ఆదేశించారు.  

AP Panchayat Eelection2021... Chandrababu Teleconference with TDP Leader
Author
Guntur, First Published Feb 9, 2021, 1:02 PM IST

అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ లో కొనసాగుతున్న మొదటి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్, జిల్లాల్లో చోటు చేసుకుంటున్న పరిణామలను పార్టీ నేతలను అడిగి తెలుసుకున్నారు టిడిపి జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు. ఎప్పటికప్పుడు గ్రామాల్లో జరుగుతున్న పరిణామాలను పార్టీ కేంద్ర కార్యాలయానికి తెలియచేయాలని ఆదేశించారు. ఇందుకోసం పార్టీ నేతలతో చంద్రబాబు టెలీ కాన్ఫరెన్సు నిర్వహించారు.

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ... సీఎం జగన్ ఒక సైకో అని మండిపడ్డారు. పంచాయతీ ఎన్నికల్లో జగన్ కు ఒక చెక్ పెట్టాలని పార్టీ నేతలతో అన్నారు. మనపై తప్పుడు కేసులు పెట్టాలని చూస్తున్నారని... వాటికి భయపడిఎవరు వెనక్కి తగ్గకుండా మరింత దూకుడుగా వెళ్ళాలన్నారు. కేసులు పెట్టినా, జైలుకి వెళ్లినా వెనక్కి తగ్గకుండా టీడీపీ నేతలు పోరాడుతున్నారని అన్నారు.

read more   ఏపీ పంచాయితీ ఎన్నికలు2021...ఊపందుకున్న పోలింగ్, ఇప్పటివరకు 34శాతం ఓటింగ్

పంచాయతీ ఎన్నికలు పూర్తి అయ్యేవరకు ఎవరు విశ్రమించవద్దని సూచించారు. నిరంతరం గ్రామాల్లో జరిగే పరిణామాలను ఎప్పటికప్పుడు తెలియచేయాలన్నారు. ఓటమి భయంతో అక్రమ నిర్బంధాలకు దిగడం అనైతికం అన్నారు.  హోం మంత్రి సొంత నియోజకవర్గంలో వైసీపీకి మద్ధతుగా పోలీసులు అక్రమ నిర్బంధాలు చేపట్టడం దారుణమన్నారు. 

గుంటూరు జిల్లా కాకుమాను మండలం గరికపాడు గ్రామంలో సర్పంచ్ గా పోటీచేస్తున్న అభ్యర్థి భర్త సునీల్ కుమార్, మండల టీడీపీ అధ్యక్షుడిని అక్రమంగా పోలీసులు అదుపులోకి తీసుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు. ఓటమి భయంతోనే వైసీపీ నేతలు ఇటువంటి అప్రజాస్వామిక విధానాలకు దిగుతున్నారని మండిపడ్డారు. తక్షణమే తెలుగుదేశం పార్టీ నేతలను విడిచిపెట్టి.. ఎన్నికలు నిష్పాక్షికంగా, శాంతియుతంగా నిర్వహించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios