Asianet News TeluguAsianet News Telugu

AP Municipal Elections 2021: వైసీపీ ఖాతాలోకి దాచేపల్లి మున్సిపాలిటీ.. ఏ పార్టీ ఎన్ని వార్డులు గెలిచిందంటే..

ఆంధ్రప్రదేశ్‌లో నెల్లూరు కార్పొరేషన్‌తో పాటు, 12 మున్సిపాలిటీలకు (AP Municipal Elections) సంబంధించిన ఓట్ల లెక్కింపు జరుగుతుంది. దాచేపల్లి మున్సిపాలిటీని (dachepalli municipal result) అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది.

AP Municipal Elections Results Updates All Eyes on Kuppam And dachepalli municipal result
Author
Amaravati, First Published Nov 17, 2021, 10:34 AM IST

ఆంధ్రప్రదేశ్‌లో నెల్లూరు కార్పొరేషన్‌తో పాటు, 12 మున్సిపాలిటీలకు (AP Municipal Elections) సంబంధించిన ఓట్ల లెక్కింపు జరుగుతుంది. గతంలో మాదిరిలో ప్రతి చోట వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSR Congress Party) హవా కొనసాగుతుంది. నెల్లూరు కార్పొరేషన్‌లో వైసీపీకి మొగ్గు ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. అయితే మిగిలిన మున్సిపాలిటీల విషయానికి వస్తే ఇప్పుడు అందరి దృష్టి కుప్పంపైనే ఉంది. కుప్పం మున్సిపాలిటీ (Kuppam municipal result) టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గంలో ఉండటంతో.. టీడీపీ దీనిని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అయితే చంద్రబాబు కంచుకోటలో జెండా ఎగరవేయాలని అధికార వైసీపీ భావిస్తోంది. 

ఇక,  దాచేపల్లి మున్సిపాలిటీలో (dachepalli municipal result) టీడీపీ, వైసీపీ మధ్య పోటా పోటీ కొనసాగింది. అయితే చివరకు అధికార పార్టీ దాచేపల్లి మున్సిపాలిటీని కైవసం చేసుకుంది.  ఇక్కడ మొత్తం 20 వార్డులు ఉండగా..అందులో ఒకటి వైసీపీ ఏకగ్రీవం కాగా... మిగిలిన 19 వార్డులకు ఎన్నికలు జరిగాయి. వాటిలో వైసీపీ 10 వార్డులు, టీడీపీ 7 వార్డులు, జనసేన ఒకటి, వైసీపీ రెబల్ అభ్యర్థి ఒక వార్డును కైవసం చేసుకున్నారు. దీంతో వైసీపీ 11 స్థానాలతో వైసీపీ అక్కడ విజయం సాధించింది.

-వైసీపీ ఖాతాలో- 1, 3, 4, 9,10, 11, 12, 13, 15, 18, 19 వార్డులు
-టీడీపీ ఖాతాలో.. 2, 5, 6, 7, 16, 17, 20 వార్డులు
-జనసేన ఖాతాలో.. 8 వ వార్డు, 
-జనసేన రెబల్ అభ్యర్థి.. 14వ వార్డు
 

Also read: AP Election Result 2021: మున్సిపల్ ఎన్నికల రిజల్ట్స్ లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ తెలుసుకోండి..

నెల్లూరు కార్పొరేషన్, కుప్పం, ఆకివీడు, జగ్గయ్యపేట, కొండపల్లి, దాచేపల్లి, గురజాల, దర్శి, బుచ్చిరెడ్డి పాలెం, బేతంచర్ల, కమలాపురం, రాజంపేట, పెనుగొండ మున్సిపాలిటీలకు కౌంటింగ్ కొనసాగుతుంది. అంతేకాకుండా గ్రేటర్‌ విశాఖలో రెండు డివిజన్‌ స్థానాలకు, విజయనగరం, కాకినాడ, ఏలూరు, మచిలీపట్నం, గుంటూరు, అనంతపురం మున్సిపల్‌ కార్పొరేషన్‌ల పరిధిలోని 10 డివిజన్‌లకు అధికారులు నేడు కౌంటింగ్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. 
 

Follow Us:
Download App:
  • android
  • ios