చిరు సేవలు మరవలేం.. మెగాస్టార్‌కు ఏపీ మంత్రి కృతజ్ఞతలు

AP Minster Kollu Ravindhra Meets Chiranjivi
Highlights

చిరు సేవలు మరవలేం.. మెగాస్టార్‌కు ఏపీ మంత్రి కృతజ్ఞతలు

ప్రముఖ సినీనటుడు, మాజీ ఎంపీ చిరంజీవిని హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో ఆంధ్రప్రదేశ్ మంత్రి కొల్లు రవీంద్ర కలిశారు.. ఈ సందర్భంగా కృష్ణా జిల్లా మచిలీపట్నంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు సహకరించిన చిరంజీవికి మంత్రి కృతజ్ఞతలు తెలిపారు..

ఈ సందర్భంగా కొల్లు మాట్లాడుతూ... చిరంజీవి రాజ్యసభ సభ్యునిగా ఉన్న కాలంలో ఆయన సహకారంతో బందరులో రూ.5 కోట్లతో వివిధ అభివృద్ది పనులు చేపట్టామని.. అవి ఇప్పుడు వివిధ దశల్లో ఉన్నాయని.. ఏడాదిలోగా ఈ పనులను పూర్తి చేస్తామని తెలిపారు.. మచిలీపట్నం నియోజకవర్గ ప్రజలు చిరంజీవికి ఎప్పటికీ రుణపడి ఉంటారన్నారు. మరోవైపు తాను కేటాయించిన నిధులతో ప్రారంభించిన పనులు విజయవంతంగా నడుస్తుండటంతో చిరు హర్షం వ్యక్తం చేశారు.. 

loader