Asianet News TeluguAsianet News Telugu

మాన్సాస్ ట్రస్ట్ వ్యవహరాల్లో జోక్యం చేసుకోలేదు: వెల్లంపల్లి శ్రీనివాసరావు

 మాన్సాస్ ట్రస్ట్ వ్యవహరాల్లో ప్రభుత్వం ఎక్కడా కూడ జోక్యం చేసుకోలేదని ఏపీ రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసులు స్పష్టం చేశారు.
 

AP minister Vellampalli Srinivas reacts on AP High court verdict over mansas trust  lns
Author
Visakhapatnam, First Published Jun 15, 2021, 2:46 PM IST

విజయవాడ: మాన్సాస్ ట్రస్ట్ వ్యవహరాల్లో ప్రభుత్వం ఎక్కడా కూడ జోక్యం చేసుకోలేదని ఏపీ రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసులు స్పష్టం చేశారు.మంగళవారం నాడు ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడారు. మాన్నాస్ ట్రస్ట్ తో పాటు సింహాచలం ఆలయ చైర్మెన్ గా సంచయిత గజపతి రాజును నియమిస్తూ  ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవోనే హైకోర్టు సోమవారం నాడు కొట్టేసింది.ఈ విషయమై మంగళవారం నాడు మంత్రి మీడియాతో మాట్లాడారు. 

also read:చట్టాలను, రాజ్యాంగాన్ని గౌరవించాలి: మాన్సాస్ ట్రస్ట్‌ వివాదంపై హైకోర్టు తీర్పుపై ఆశోక్‌గజపతిరాజు

also read:మాన్సాస్ ట్రస్ట్ పై హైకోర్టు తీర్పు... తిరిగి అప్పీలుకు వెళతాం: మంత్రి వెల్లంపల్లి

మాన్సాస్ ట్రస్ట్ చైర్మెన్ గా సంచయిత నియామకం కావడాన్నిఆశోక్‌గజపతిరాజు జీర్ణించుకోలేకపోతున్నారన్నారు.అన్యాక్రాంతమైన  మాన్సాస్ ట్రస్ట్ భూములపై విచారణ చేస్తున్నామన్నారు. అన్యాక్రాంతమైన ట్రస్టు దేవాలయ భూములను గుర్తిస్తున్నామని చెప్పారు.బొబ్బిలి దేవాలయ భూములపై కూడ విచారణ సాగుతోందని ఆయన తెలిపారు. మాన్సాస్ ట్రస్ట్ చైర్మెన్ గా సంచయిత గజపతిరాజు గా జగన్ ప్రభుత్వం నియమించింది.ఈ నియామకంపై ఆశోక్‌గజపతి రాజు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
మాన్సాస్ ట్రస్ట్ విషయంలో ఏపీ హైకోర్టు తీర్పు వెల్లడించిన కొద్దిసేపటికే ఈ విషయమై మాజీ కేంద్ర మంత్రి ఆశోక్‌గజపతి రాజు స్పందించారు. 

 


 

Follow Us:
Download App:
  • android
  • ios