చట్టాలను, రాజ్యాంగాన్ని గౌరవించాలి: మాన్సాస్ ట్రస్ట్ వివాదంపై హైకోర్టు తీర్పుపై ఆశోక్‌గజపతిరాజు
రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా చట్టాలను, రాజ్యాంగాన్ని గౌరవించాలని మాజీ మంత్రి, టీడీపీ నేత ఆశోక్‌గజపతిరాజు కోరారు.
విజయనగరం: రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా చట్టాలను, రాజ్యాంగాన్ని గౌరవించాలని మాజీ మంత్రి, టీడీపీ నేత ఆశోక్‌గజపతిరాజు కోరారు.మాన్సాస్ ట్రస్ట్ తో పాటు సింహాచలం దేవాలయ ట్రస్ట్ బోర్డు చైర్మెన్ గా సంచయిత గజపతిరాజును నియమిస్తూ తీసుకొచ్చిన జీవోను ఏపీ హైకోర్టు కొట్టేసింది. హైకోర్టు తీర్పు తర్వాత మాజీ కేంద్ర మంత్రి ఆశోక్‌గజపతిరాజు సోమవారం నాడు మీడియాతో మాట్లాడారు. తనపై కక్షతో, కోపంతో మాన్సాస్ ట్రస్ట్‌లో ఉద్యోగులను ఇభ్బందిపెట్టారన్నారు. అంతేకాదు మూగజీవాలను కూడ హింసించి చంపారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాక్షసులు కూడ ఇలా చేసి ఉండరని ఆయన అభిప్రాయపడ్డారు.
also read:మాన్సాస్ ట్రస్ట్ కేసు: జగన్ ప్రభుత్వానికి హైకోర్టు షాక్, సంచయిత నియామకం రద్దు
తాను రామతీర్థం దేవస్థానానికి పంపిన విరాళానికి తిరిగి పంపిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. తాను ట్రస్ట్ తో పాటు దేవాలయానికి చైర్మెన్ గా ఉన్న సమయంలో అక్రమాలు జరిగాయని ఆరోపించారన్నారు. తాను అక్రమాలకు పాల్పడితే ఇప్పటివరకు ఎందుకు నిరూపించలేకపోయారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. హైకోర్టు తీర్పుతో దేశంలో చట్టాలు, రాజ్యాంగం ఉందని మరోసారి రుజువైందని చెప్పారు. అధికారులు ఉద్యోగ ధర్మాన్ని పాటించాలని ఆయన కోరారు.