మాన్సాస్ ట్రస్ట్ పై హైకోర్టు తీర్పు... తిరిగి అప్పీలుకు వెళతాం: మంత్రి వెల్లంపల్లి

మాన్సాస్ ట్రస్ట్ విషయంలో తాము ఎక్క‌డా నిబంధ‌న‌లు ఉల్లంఘించ‌లేదని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తెలిపారు.

AP Endowment Minister Vellampalli Reacts High Court Judgement on Mansas Trust akp

అమరావతి: మాన్సాస్ ట్ర‌స్ట్‌పై హైకోర్టు తీర్పును స‌వాల్ చేస్తామని ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు.  కోర్టు తీర్పు కాపీ పూర్తిగా చూడలేదని... అందువల్లే ఈ తీర్పుపై ఎక్కువగా మాట్లాడబోనన్నారు. అయితే పైకోర్టు ఆదేశాలను బట్టి మళ్లీ అప్పీలుకు వెళతామన్నారు. 

మాన్సాస్ ట్రస్ట్ విషయంలో తాము ఎక్క‌డా నిబంధ‌న‌లు ఉల్లంఘించ‌లేదని మంత్రి తెలిపారు. కోర్టుల్లో తీర్పులు ఒక్కోసారి అనుకూలంగా... ఒక్కోసారిగా వ్యతిరేకంగా వస్తాయయన్నారు. మాన్సాస్ ట్రస్ట్ విషయంలో కోర్టు ఆదేశాలను పరిశీలిస్తున్నామని... ఏదైనా చట్ట ప్రకారమే అన్నీ జరుగుతాయన్నారు.  

''మాన్సాస్ ట్రస్ట్ పరిధిలో చంద్రబాబు హయాంలో ఏం అబివృద్ది చేశారు. లోకేష్ ఈ విషయం గురించి మాట్లాడటానికి అటు పిల్లాడు కాదు.. ఇటు పెద్దవాడు కాదు. అక్కడ జరిగిన అక్రమాలను గుర్తించి అన్నీ చట్టబద్ధం చేస్తున్నాం. మేము ఏది చేసినా చట్టప్రకారం న్యాయబద్ధంగా చేస్తాం. ఒక కోర్టులో వ్యతిరేకంగా రాగానే లోకేష్ గెలిచినట్లు కాదు... ఇంకా చాలా కోర్టులు ఉన్నాయి'' అన్నారు మంత్రి  వెల్లంపల్లి. 

read more జగన్ రెడ్డీ... ఇకనైనా అవి తాట తీస్తాయని గుర్తుంచుకో..: చంద్రబాబు హెచ్చరిక

''ఇక బ్రహ్మంగారి మఠం విషయంలో చట్ట ప్రకారమే నిర్ణయాలు తీసుకుంటాం. వారి వీలునామా చట్ట ప్రకారం 90 రోజుల్లో ధార్మిక పరిషత్ కి చేరాలి. దానిపై పీఠాధిపతులతో  కమిటీ వేసి చట్ట ప్రకారం నిర్ణయం తీసుకుంటాం'' అని తెలిపారు. 

''బ్రహ్మంగారి మఠం విషయంలో శివ స్వామి ముందుగానే నిర్ణయం ప్రకటించటం సరికాదు . ప్రభుత్వం సాధ్యమైనంత త్వరగా నిర్ణయం తీసుకుంటుంది. అప్పటివరకు అక్కడ ఒక ఇంచార్జీని కూడా పెట్టాం'' అని మంత్రి వెల్లంపల్లి వెల్లడించారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios