నిరుద్యోగులను మోసం చేసిన చరిత్ర చంద్రబాబుదే: టీడీపై మంత్రి రోజా ఫైర్

ప్రతి ఇంటికో ఉద్యోగం ఇస్తామని ఇచ్చిన హామీని అమలు చేయకుండా మోసం చేసిన చరిత్ర చంద్రబాబుదని ఏపీ మంత్రి ఆర్ కే రోజా విమర్శించారు. అసెంబ్లీలో టీడీపీ సభ్యులు ఈ విషయమై ఆనవసర రాద్ధాంతం చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. 
 

AP Minister RK Roja Reacts on TDP MLAS protest in Assembly

అమరావతి: నిరుద్యోగులను మోసం చేసిన చరిత్ర చంద్రబాబుదని ఏపీ మంత్రి ఆర్ కే రోజా విమర్శించారు. 
ఏపీ అసెంబ్లీ వాయిదా పడిన తర్వాత  మంత్రి ఆర్ కే రోజా  గురువారం నాడు అసెంబ్లీ మీడియా పాయింట్ లో మీడియాతో మాట్లాడారు.

  ప్రభుత్వ ఉద్యోగాల  భర్తీ విషయమై మాట్లాడే అర్హత టీడీపీకి లేదని మంత్రి రోజా చెప్పారు.  బాబు వస్తే జాబ్ వస్దుందని టీడీపీ నేతలు ప్రచారం చేసుకున్నారని ఆమె చెప్పారు. 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వకుండా మోసం చేశారని ఆమె విమర్శించారు. 

 ప్రతి ఇంటికో ఉద్యోగం ఇస్తామని టీడీపీ  హామీ ఇచ్చి తుంగలో తొక్కిందన్నారు. దేశంలోని ఏ రాష్ట్ర ప్రభుత్వం కల్పించని రీతిలో నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చిందన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 1.21,500 మందికి ఉద్యోగాలు ఇచ్చిన విషయాన్ని మంత్రి రోజా గుర్తు చేశారు. గ్రామ సచివాలయాల్లో వీరంతా  ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు అందిస్తున్నారన్నారు. నిరుద్యోగులను మోసం చేసిన చరిత్ర చంద్రబాబుదేనన్నారు. 

వైద్య ఆరోగ్యశాఖలో 42 వేలు, విద్యాశాఖలో 4758 పోస్టులను భర్తీ చేసినట్టుగా  ఏపీ మంత్రి రోజా చెప్పారు.  చంద్రబాబు హయంలో డీఎస్పీ ద్వారా భర్తీ చేయాల్సిన పోస్టులను కూడా తమ ప్రభుత్వం భర్తీ చేసిందని ఆమె ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసుకొని ఆర్టీసీ కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపామన్నారు. 

ప్రజా సమస్యలపై టీడీపీకి చిత్తశుద్ది లేదని మంత్రి విమర్శించారు. సభలో టీడీపీ అనవసర రాద్ధాంతం చేస్తుందన్నారు.  ప్రజలకు ఉపయోగపడే అంశాలపై అసెంబ్లీలో చర్చించడం టీడీపీకి ఇష్టం లేదని ఆమె అభిప్రాయపడ్డారు.   టీడీపీకి రాజకీయాలే ముఖ్యమన్నారు. 

also read:టీడీపీ సభ్యుల ఆందోళన: ఏపీ అసెంబ్లీ 10 నిమిషాలు వాయిదా వేసిన స్పీకర్

అమరావతీ కావాలా మూడు ప్రాంతాలు కావాలా అని ప్రజలను టీడిపి నేతలు అడగాలన్నారు. కొడాలి నాని నేను టీడిపి నుంచే వచ్చామన్నారు. కొడాలి నాని మాట్లాడిన వాటిలో తప్పు ఏముందని ఆమె ప్రశ్నించారు. నాడు ఎన్టీయార్ అభిమానులుగా తాము టీడీపీలో ఉన్నట్టుగా మంత్రి చెప్పారు. .
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios