టీడీపీ నేతల్లో విభేదాలు మరోసారి బయటపడ్డాయి. మంత్రి పత్తిపాటి పుల్లారావు, మరో మంత్రి రావెల కిశోర్ బాబుకి మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. ఒకరి నియోజకవర్గంలో మరొకరు వేలు పెడుతున్నారంటూ ఒకరిపై మరొకరు నిప్పులు చెరిగారు. సొంత పార్టీ నేతలపైనే ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి రావెల కిషోర్‌బాబు తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. తన నియోజకవర్గంలో మంత్రి పుల్లారావు అనుచరుల జోక్యం ఏంటని ప్రశ్నించారు. దళిత ప్రజా ప్రతినిధుల నియోజకవర్గంలో ఇతరుల ప్రమేయం మంచిది కాదని హితవు పలికారు. రాష్ట్రంలో అన్ని చోట్ల ఇదే విధంగా జరుగుతోందన్నారు. ఇలాంటి చర్యలతో దళిత జాతిలో అభద్రతాభావం పెరుగుతుందన్నారు.

ఇక్కడితో ఆగకుండా మరో సీనియర్ నేత వర్ల రామయ్య పై కూడా రావేల ఫైర్ అయ్యారు.‘వర్ల రామయ్యకు పదవి రావడంతో అహంకారం పెరిగింది. వెంటనే మాదిగలకు క్షమాపణ చెప్పాలి. లేదంటే మాదిగల ఆగ్రహానికి గురికాక తప్పదు.’ అని హెచ్చరించారు. కాగా ఆర్టీసీ బస్సులో ఇయర్‌ ఫోన్స్‌ పెట్టుకుని పాటలు వింటున్న ఓ యువకుడిని వర్ల రామయ్య కులం పేరుతో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. కాగా.. తాజాగా.. ఈ విషయంలో వర్ల తన తప్పును అంగీకరించారు. విద్యార్థికి క్షమాపణలు చెబుతున్నట్లు కూడా తెలిపారు.

అయితే.. మంత్రి రావెల.. ఈ విధంగా మంత్రి పత్తిపాటి పై వర్ల రామయ్యపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం అందరినీ షాకింగ్ కి గురి చేసింది. ప్రజల సమస్యలు పట్టించుకోకుండా సొంత పార్టీ నేతలే ఒకరిని మరొకరు విమర్శించుకోవడం హాస్యాస్పదంగా ఉందనే వాదనలు వినపడుతున్నాయి.