ఢిల్లీలో ధర్నా చేయండి, మద్దతిస్తా: పెట్రోల్ ధరల తగ్గింపుకై బీజేపీ నేతలకు పేర్ని సలహా


పెట్రోలియం ఉత్పత్తుల ధరల తగ్గింపుకై ఢిల్లీలో ధర్నా చేస్తే తాను సహకరిస్తానని ఏపీ రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పేర్ని నాని చెప్పారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడారు.

AP Minister Perni Nani Reacts on Somu Veerraju Comments Over Petrol rates

అమరావతి: రాకెట్ కంటే వేగంగా Petrol, Diesel ధరలను కేంద్రం పెంచిందని ఏపీ రాష్ట్ర సమాచార శాఖ మంత్రి Perni Naniవిమర్శించారు. ధరలు పెంచిన వేగంతో ధరలను తగ్గించలేదన్నారు. నామమాత్రంగా ధరలను తగ్గించి రాష్ట్ర ప్రభుత్వాలు ధరలను తగ్గించాలని Bjp నేతలు డిమాండ్ చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు.

ఏపీ రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పేర్ని నాని సోమవారం నాడు అమరావతిలో మీడియాతో మాట్లాడారు.  పెట్రోల్ ధరను వంద రూపాయాలు దాటించిన ఘనత బీజేపీదేనని ఆయన విమర్శించారు. ప్రజలపై జాలి, దయ లేకుండా పెట్రోల్, డీజీల్ ధరలను పెంచారని మంత్రి చెప్పారు. కేంద్ర ప్రభుత్వం పెంచిన ధరల విషయం ప్రజలకు తెలియదనే భ్రమలో బీజేపీ నేతలున్నారన్నారు.

also read:పెట్రో ధరలపై సరైన సమయంలో నిర్ణయం.. డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ కీలక వ్యాఖ్యలు

పెట్రోల్, డీజీల్ లపై  ఐదు రూపాయాలు కాదు,  25 రూపాయాలను తగ్టించాలని  బీజేపీ నేతలు కేంద్రాన్ని డిమాండ్ చేయాలని ఆయన సలహా ఇచ్చారు. రోడ్డు సెస్ రూపంలో  పెట్రోల్ , డీజీల్ ల పై కేంద్ర ప్రభుత్వం రూ. 2.85 లక్షల కోట్లు వసూలు చేస్తోందని మంత్రి నాని గుర్తు చేశారు. పెట్రోలియం ఉత్పత్తుల ధరలను తగ్గించాలని ఢిల్లీలో బీజేపీ నేతలు ధర్నా చేస్తే తాను కూడా వస్తానని మంత్రి చెప్పారు. 

రూ. 70 లు ఉన్న లీటర్ పెట్రోల్ ధరను రూ. 110 లకు  తీసుకెళ్లారన్నారు అక్టోబర్ మాసంలో లీటర్ పెట్రోల్, డీజీల్ ధర ఎంతుంది, ఇప్పుడు ఎంతుందని మంత్రి బీజేపీ నేతలను ప్రశ్నించారు.

ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీకి ప్రజలు బుద్ది చెప్పినందున ఐదు నుండి 10 రూపాయాలు ధర తగ్గించి ధరలు తగ్గించామని ఫోజులు కొడుతున్నారని మంత్రి నాని మండిపడ్డారు. ఉప ఎన్నికల ఫలితాలతో కేంద్రం కళ్లు తెరిచిందని మంత్రి నాని ఎద్దేవా చేశారు. పెట్రోల్, డీజీల్ ధరలను విపరీతంగా పెంచి నామమాత్రంగా ధరలను తగ్గించి తమకు నీతులు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. కేంద్రం వసూలు చేస్తున్న పన్నులు ఎలా ఖర్చు  చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు.

దేశంలోని 14 రాష్ట్రాల్లో పెట్రోల్, డీజీల్ ధరలు ఎందుకు తగ్గించలేదని ఆయన ప్రశ్నించారు.  తాను అధికారంలో ఉన్న సమయంలో పెట్రోల్, డీజీల్ పై పన్నుల భారం వేసిన Chandrababu ఇవాళ  ధరల పెరుగుదల గురించి మాట్లాడడాన్ని మంత్రి తప్పుబట్టారు. ఈ నెల 9వ తేదీన ధర్నా చేయడానికి చంద్రబాబకు ఏం హక్కు ఉందని ఆయన ప్రశ్నించారు. తమ ప్రభుత్వంపై బురదచల్లేందుకు Tdp ప్రయత్నిస్తోందన్నారు.

 ఏపీలో అమలౌతున్న కార్యక్రమాలు దేశంలో ఎక్కడైనా ఉన్నాయా అని ఆయన ప్రశ్నించారు.వరుస ఎన్నికల్లో  తమ పార్టీకి వస్తున్న ఫలితాలే ప్రజాదరణకు నిదర్శనమని మంత్రి నాని చెప్పారు.

ఇదిలా ఉంటే కేంద్ర ప్రభుత్వం పెట్రోలియం ఉత్పత్తులపై  ఎక్సైజ్ డ్యూటీని తగ్గించింది. దీంతో ఏపీ ప్రభుత్వం కూడా పెట్రోల్, డీజీల్ పై పన్నుల తగ్గించాలని బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు డిమాండ్ చేశారు.ఈ వ్యాఖ్యలపై మంత్రి స్పందించారు.

.


 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios