పెట్రో ధరలపై (Petrol price) సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ (Dharmana Krishna Das) అన్నారు. ప్రజలు మేలు చేకూర్చే నిర్ణయమే తీసుకుంటామని చెప్పారు. 

పెట్రో ధరలపై (Petrol price) సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ (Dharmana Krishna Das) అన్నారు. ప్రజలు మేలు చేకూర్చే నిర్ణయమే తీసుకుంటామని చెప్పారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం పెట్రోల్‌పై రూ. 5, డీజిల్‌పై రూ. 10 ఎంక్సైజ్ సుంకం తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఆ నిర్ణయం వెలువడిన కొన్ని గంటల్లోనే బీజేపీ పాలిత రాష్ట్రాలు.. పెట్రోల్, డీజిల్ ధరలపై మరింతగా తగ్గింపులు చేపట్టినట్టుగా వెల్లడించాయి. ఈ నేపథ్యంలోనే ఏపీలో కూడా వ్యాట్ తగ్గించాలనే డిమాండ్ వినిపిస్తోంది.

ఈ నేపథ్యంలో పెట్రోల్ ధరలకు సంబంధించి తాజాగా ధర్మాన కృష్ణదాస్ స్పందించారు. పెట్రోల్, డీజిల్ ధరలపై సుంకాన్ని తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని తెలిపారు. ఏపీ ప్రభుత్వం సరైన సమయంలో పెట్రోల్ ధరలపై నిర్ణయం తీసుకుంటుందని.. ప్రజలకు మేలు చేసేలా నిర్ణయం ఉంటుందని చెప్పారు. 

Also read: టీటీడీ కీలక నిర్ణయం.. మూడు రోజుల పాటు శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు, ఎప్పుడంటే..?

ఇక, కేంద్రం పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకం తగ్గించిన నేపథ్యంలో బీజేపీ పాలిత రాష్ట్రాలు వ్యాట్ తగ్గించాయి. ఒక్కో రాష్ట్రం.. ఒక్కో విధంగా తగ్గింపులు చేపట్టాయి. దీంతో మిగిలిన రాష్ట్రాలు కూడా వ్యాట్ తగ్గించాలనే డిమాండ్ వినిపిస్తోంది. ఇప్పటివరకు 22 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు వ్యాట్‌ను తగ్గించాయి. కర్ణాటకంగా గరిష్టంగా లీటర్ పెట్రోల్‌పై 8.62 చొప్పున తగ్గించింది. దీంతో అక్కడ పెట్రోల్ ధర రూ. 100కి చేరింది. 

ఇదిలా ఉంటే రాజస్తాన్, పంజాబ్, చత్తీస్‌ఘడ్, తమిళనాడు, తెలంగాణ, ఏపీ, పశ్చిమ బెంగాల్, కేరళ, జార్ఖండ్‌, ఢిల్లీ ప్రభుత్వాలు వ్యాట్‌ తగ్గింపుపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో ఆయా రాష్ట్రాల్లో ప్రతిపక్ష పార్టీలు వ్యాట్ తగ్గించాలని ఒత్తిడి తెస్తున్నాయి. ఇక, నేడు విజయవాడలో లీటరు పెట్రోల్ ధర రూ.110.98, డీజిల్ ధర రూ. 97గా ఉంది.

Also read: ఉపముఖ్యమంత్రి ఆళ్ల నాని మానవీయత.. ఆటో దగ్గరకెళ్లి వృద్ధుడి పెన్షన్‌ పునరుద్ధరణకు ఆదేశాలు

నవంబర్ 9న టీడీపీ నిరసనలు.. 
పెట్రోల్‌, డీజిల్‌పై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం వ్యాట్ తగ్గించాలని టీడీపీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) డిమాండ్ చేశారు. పెట్రోల్‌, డీజిల్‌పై రాష్ట్రంలో ఎక్కువ ధరలు ఉన్నాయని అన్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు (petrol diesel price) తగ్గించేవరకు టీడీపీ పోరాటం కొనసాగిస్తుందన్నారు. రాష్ట్రంలో అన్ని పెట్రోల్ బంక్‌ల వద్ద మంగళ వారం (నవంబర్ 9వ తేదీ) మధ్యాహ్నం 12 గంటల నుంచి 1 గంట వరకు టీడీపీ శ్రేణులు ధర్నాలు చేపట్టనున్నట్టుగా వెల్లడించారు. తమ ధర్నాల ద్వారా ప్రజల్లో అవగాహన కల్పిస్తామని చెప్పారు. పెట్రోల్‌ను అన్ని రాష్ట్రాలకంటే తక్కువ ధరకే అందిస్తానని ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు చెప్పిన జగన్‌రెడ్డి.. ఇప్పుడు మాత్రం ధరలు పెంచుకుంటూ పోతున్నారని విమర్శించారు.