అయ్యన్న పాత్రుడికి త్రుటిలో తప్పిన ప్రమాదం ఎండ్లబండి నుంచి కిందపడిపోయిన మంత్రి

ఆంధ్రప్రదేశ్ మంత్రి అయ్యన్న పాత్రుడు త్రుటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. విశాఖపట్నంలోని అనాకపల్లిలోని తుమ్మపాలలో నిర్వహించిన టిడిపి జనచైతన్య యాత్రలో ఆయన పాల్గొనడానికి వచ్చారు. ఈ సందర్భంగా కార్యకర్తలు ఆహ్వానించడంతో టిడిపి నేతలతో కలసి ఎద్దుల బండి ఎక్కారు.

అయితే అక్కడ ఉన్న జనాలు, శబ్దాలతో ఎద్దులు ఒక్కసారిగా బెదిరిపోయాయి. బండిని వదిలి దూరంగా వెళ్లిపోడానికి ప్రయత్నంచాయి. దీంతో బండి మీద నేతలు ఒక్కసారిగా కింద పడ్డారు. భద్రతా సిబ్బంది, పోలీసులు అప్రమత్తమై వెంటనే స్పందించడంతో ప్రమాదం మంత్రి సురక్షితంగా బయటపడ్డారు.