అమరావతి: మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబుపై మరోసారి తనదైన శైలిలో రెచ్చిపోయారు మంత్రి కొడాలి నాని. సీఎం వైఎస్‌ జగన్‌ని విమర్శించే స్థాయి నారా లోకేష్‌కు లేదన్నారు. నారా లోకేష్ ఒక సైకో అంటూ అభివర్ణించారు. 

లోకేష్‌ తిన్నది అరక్క నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నాడంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో లోకేష్ ని మించిన సైకో ఎవరూ ఉండరన్నారు. మంత్రి పదవి కోసం చంద్రబాబును సోఫాలో పడుకోబెట్టి ఒత్తిడి తెచ్చిన సైకో అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. 

టీడీపీకి జూనియర్ ఎన్టీఆర్ దూరం, కారణం ఆ ఇద్దరే: టీడీపీ నేత కీలక వ్యాఖ్యలు

వైఎస్సార్‌ కుటుంబంపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదని లోకేష్ కు హెచ్చరించారు. లోకేష్‌ తిన్నది అరక్క నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని టీడీపీ నేతలు అదుపులో పెట్టుకోవాలంటూ సూచించారు. 

లోకేష్‌ తాత గురించి తిరుపతిలో ఎవరిని అడిగినా చెప్తారంటూ గతాన్ని తవ్వి మరీ కెలికారు కొడాలి నాని. ఇకపోతే మాజీ సీఎం చంద్రబాబు రాష్ట్రాన్ని దోచేసిన దొంగ అంటూ విరుచుకుపడ్డారు. 

మరోవైపు బీజేపీ ఎంపీ సుజనా చౌదరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సుజనా చౌదరి బ్రోకర్‌లా మాట్లాడుతున్నారంటూ మండిపడ్డారు. బ్యాంకులకు కన్నాలేసిన దొంగ సుజనా చౌదరి అని అలాంటి వ్యక్తుల మాటలకు విలువ లేదన్నారు. వైసీపీ ఎంపీలకు బీజేపీలోకి వెళ్లాల్సిన ఖర్మపట్టలేదన్నారు మంత్రి కొడాలి నాని. 
జూ.ఎన్టీఆర్ కి పోటీగా చంద్రబాబు వ్యూహం: తెరపైకి మరో నందమూరి వారసుడు