Asianet News TeluguAsianet News Telugu

లోకేష్ సర్పంచ్‌గా గెలిస్తే రాష్ట్రం వదిలిపోతా: మంత్రి కొడాలి నాని సవాల్

చిత్తూరు జిల్లాలో సర్పంచ్‌గా పోటీ చేసి నారా లోకేష్ గెలిస్తే తాను రాష్ట్రం వదిలి వెళ్లిపోతానని ఏపీ రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి కొడాలి నాని సవాల్ విసిరారు. 

AP minister Kodali nani challenges to TDP leader Nara Lokesh lns
Author
Guntur, First Published Feb 12, 2021, 11:00 AM IST

అమరావతి: చిత్తూరు జిల్లాలో సర్పంచ్‌గా పోటీ చేసి నారా లోకేష్ గెలిస్తే తాను రాష్ట్రం వదిలి వెళ్లిపోతానని ఏపీ రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి కొడాలి నాని సవాల్ విసిరారు. 

శుక్రవారం నాడు మంత్రి  అమరావతిలో మీడియాతో మాట్లాడారు.రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్న విపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఆయన మండి పడ్డారు.చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు కలిసి వస్తే స్టీల్ ప్లాంట్ పై పోరాటం చేస్తానని కొడాలి నాని ప్రకటించారు.

ఇంటింటికి రేషన్ సరఫరా కోసం తమ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాన్ని ఎన్నికల పేరుతో నిలిపివేశారన్నారు. ఇంటింటికి రేషన్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఒక్కటేనని ఆయన చెప్పారు.

కుట్రలు చేయడం దిక్కుమాలిన టీడీపీ అలవాటేనన్నారు. తొలి దశ పంచాయితీ ఎన్నికల్లో 83 శాతం సీట్లను గెలిచినట్టుగా ఆయన గుర్తు చేశారు.  దేవినేని ఉమా నియోజకవర్గంలో 48 పంచాయితీల్లో 44 గెలిచినట్టుగా ఆయన తెలిపారు. 

చంద్రబాబు మాటలు విని ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలైన టీడీపీ నేతలు ఇప్పుడు ఏడుస్తున్నారన్నారు. రెండో దశ ఎన్నికలు వచ్చేసరికి పుతిన్, ఐక్యరాజ్యసమితికి కూడ లేఖ రాస్తారని మంత్రి ఎద్దేవా చేశారు. 

తొలిదశ పంచాయితీ ఎన్నికల ఫలితాలతో బాబుకు మైండ్ బ్లాంక్ అయిందన్నారు. చంద్రబాబును పార్టీ నుండి బయటకు గెంటితేనే టీడీపీకి మనుగడ ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios