Asianet News TeluguAsianet News Telugu

మేం వెళ్లిపోయాం, జూ.ఎన్టీఆర్ కు టీడీపీని అప్పగించు: బాబుపై రెచ్చిపోయిన కొడాలి నాని

ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్, తన వల్లే జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీకి దూరమయ్యారంటూ తమపై ఆరోపణలు చేస్తున్నారని విరుచుకుపడ్డారు. వంశీ, తాను బయటకు వచ్చేశామని ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కు పార్టీని అప్పగిస్తారా అంటూ ప్రశ్నించారు మంత్రి కొడాలి నాని. 

ap minister Kodali Nani again fires on ex cm chandrababu naidu
Author
Amaravathi, First Published Nov 21, 2019, 6:59 PM IST

అమరావతి: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపై మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు మంత్రి కొడాలి నాని. తిరుమల తిరుపతి దేవస్థానంలో సీఎం జగన్ పర్యటనపై డిక్లరేషన్ అడిగే హక్కు చంద్రబాబుకు లేదని మండిపడ్డారు. 

డిక్లరేషన్ గురించి మరోసారి అడిగితే తాను ఇంకా తిడతానంటూ చంద్రబాబు నాయుడుకు హెచ్చరించారు. తాను వెంకటేశ్వరస్వామి భక్తుడిని అని చెప్పుకొచ్చారు. ఇసుకదీక్షలో చంద్రబాబు నాయుడు డిక్లరేషన్ లో జగన్ సంతకం పెట్టి లోపలికి వెళ్లాలంటూ కీలక వ్యాఖ్యలు చేశారని అప్పుడు ఆ టాపిక్ ఎందుకు వచ్చిందని నిలదీశారు. 

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా సీఎం జగన్ ఏదేవాలయానికి అయినా వెళ్లే హక్కు ఉంటుందన్నారు. రాష్ట్రంలో ఏ చర్చికి, మసీదుకి అయినా కూడా వెళ్తారని తాను అన్నట్లు చెప్పుకొచ్చారు. ఇప్పటి వరకు తాను 20 సార్లు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నట్లు చెప్పుకొచ్చారు. 

దివంగత సీఎం వైయస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వకముందే తిరుమల తిరుపతి దేవస్థానాన్ని దర్శించుకున్నారని తెలిపారు. 

జగన్మోహన్ రెడ్డిని డిక్లరేషన్ అడిగే హక్కు చంద్రబాబు నాయుడుకు ఎక్కడ ఉందని తాను నిలదీసినట్లు తెలిపారు. తిరుమల తిరుపతి దేవాలయం నీ అయ్య, నీయమ్మ మెుగుడు ఖర్జూరనాయుడు కట్టించారా నీకు సంబంధం ఏంటని తాను చంద్రబాబును ప్రశ్నించడం జరిగిందన్నారు. 

తాను చంద్రబాబు నాయుడిని విమర్శిస్తే దాన్ని తీసుకెళ్లి టీటీడీకి అంటగడుతున్నారని మండిపడ్డారు. రాజకీయ రంగు పులిమేందుకు రకరకాల ఆరోపణలు చేస్తున్నారంటూ విరుచుకుపడ్డారు. వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్లి దర్శనం చేసుకోవాలంటే బీజేపీ, టీడీపీ ప్రాథమిక సభ్యత్వాలు తీసుకెళ్లాలా అని నిలదీశారు. 

మాట్లాడితే చంద్రబాబు నాయుడు తన కులదైవం వెంకటేశ్వరస్వామి అని చెప్తున్నారని కమ్మ సామాజిక వర్గంలో పుడితేనే స్వామిని దర్శించుకోవాలా అంటూ విరుచుకుపడ్డారు. కులదైవం కుల దైవం అని చెప్పుకుంటున్న చంద్రబాబు తన కొడుక్కి, మనవడికి వెంకటేశ్వరస్వామి పేరు ఎందుకు పెట్టుకోలేదని నిలదీశారు.  కమ్మవాళ్లే స్వామిని దర్శించుకోవాలా మిగిలిన వారు నీ పర్మిషన్ లేకపోతే బీజేపీ పర్మిషన్ తీసుకోవాలా అంటూ నిలదీశారు. 

ఈ రాష్ట్రంలో పాదయాత్ర ప్రారంభోత్సవంకు ముందు శ్రీవారిని జగన్ దర్శించుకున్నారని, పాదయాత్ర అనంతరం కూడా శ్రీవారిని దర్శించుకున్నారని చెప్పుకొచ్చారు. వెంకటేశ్వరస్వామిని జగన్ నమ్మారు కాబట్టే ఆయన సీఎం అయ్యారని వెంకటేశ్వరస్వామి అనుగ్రహం జగన్ కు ఆయన కుటుంబానికి ఉందన్నారు. 

ఒకే కుటుంబంలో తండ్రీ కొడుకు ఇద్దరూ ముఖ్యమంత్రులుగా స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించే అదృష్టం దక్కించుకున్నారన్నారు. దివంగత సీఎం ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయ్యారని కానీ వారి వారసులకు పట్టువస్త్రాలు సమర్పించే భాగ్యం శ్రీవారు కల్పించలేదన్నారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు సీఎం అయ్యారని వారి కుమారుడు నారా లోకేష్ కు కల్పించలేదు కదా అని నిలదీశారు. 

రాష్ట్రంలో అనేకమంది ముఖ్యమంత్రులు అయ్యారని అయితే తండ్రీ కొడుకులు స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించే భాగ్యాన్ని ఎవరికి కల్పించలేదని అది కేవలం జగన్ కుటుంబానికి మాత్రమే కల్పించారన్నారు. 

తిరుమల శ్రీవారిని అవమానించింది చంద్రబాబు నాయుడు అంటూ విమర్శించారు. శ్రీవారి లడ్డూను మద్యంతో పోలిస్తున్నారంటూ ధ్వజమెత్తారు. చంద్రబాబు నాయుడు ఎలాంటి వారో తెలుసు కాబట్టే అలిపిరి ప్రమాదంలో వెంకన్న కాపాడారంటూ చెప్పుకొచ్చారు. పప్పు, చంద్రబాబు నాయుడులకు కమీషన్లు ఇవ్వడమే దేవినేని ఉమా మహేశ్వరరావు పని తిట్టిపోశారు. 

ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్, తన వల్లే జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీకి దూరమయ్యారంటూ తమపై ఆరోపణలు చేస్తున్నారని విరుచుకుపడ్డారు. వంశీ, తాను బయటకు వచ్చేశామని ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కు పార్టీని అప్పగిస్తారా అంటూ ప్రశ్నించారు మంత్రి కొడాలి నాని. 


ఈ వార్తలు కూడా చదవండి

జూ.ఎన్టీఆర్ కి పోటీగా చంద్రబాబు వ్యూహం: తెరపైకి మరో నందమూరి వారసుడు

టీడీపీకి జూనియర్ ఎన్టీఆర్ దూరం, కారణం ఆ ఇద్దరే: టీడీపీ నేత కీలక వ్యాఖ్యలు

Follow Us:
Download App:
  • android
  • ios