Asianet News TeluguAsianet News Telugu

మా సన్నబియ్యమే తెలంగాణలో తింటున్నారు .. మీ రాజకీయాలు మీ దగ్గరే చూసుకోండి : కేసీఆర్‌కు మంత్రి కారుమూరి కౌంటర్

తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు ఏపీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు . ఏపీలో పండుతోన్న సన్నబియ్యాన్ని తెలంగాణలో తింటున్నారని.. ఆ బియ్యాన్నే అక్కడ కొనుగోలు చేస్తున్నారని మంత్రి తెలిపారు. 
 

ap minister karumuri nageswara rao counter to telangana cm kcr ksp
Author
First Published Nov 3, 2023, 6:49 PM IST

ఆంధ్రప్రదేశ్‌లో పరిస్ధితులపై ఇటీవల తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. తాజాగా వీటికి కౌంటర్ ఇచ్చారు ఏపీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో ఎన్నికలొస్తే కేసీఆర్ అక్కడి రాజకీయాలే చూసుకోవాలని చురకలంటించారు. ఏపీలో పండుతోన్న సన్నబియ్యాన్ని తెలంగాణలో తింటున్నారని.. ఆ బియ్యాన్నే అక్కడ కొనుగోలు చేస్తున్నారని మంత్రి తెలిపారు. 

ధాన్యం కొనుగోళ్లు ఆలస్యం అవుతున్నాయని కేసీఆర్ అబద్ధాలు చెబుతున్నారని మంత్రి కారుమూరి ఆరోపించారు. చిన్న వర్షానికే హైదరాబాద్ మునిగిపోతుంటే పదేళ్లు సీఎంగా వున్న కేసీఆర్ ఏం చేస్తున్నారని నాగేశ్వరరావు ప్రశ్నించారు. చిన్న పిల్లలు నాలాల్లో కొట్టుకుపోతుంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేస్తోందని ఆయన నిలదీశారు. ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో పేదరికం 6 శాతానికి తగ్గిందని.. విశాఖను రాజధానిగా అభివృద్ధి చేస్తామని కారుమూరి నాగేశ్వరరావు స్పష్టం చేశారు. 

కాగా.. వైసీపీ నేత, ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి గురువారం మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల కోసమే కేసీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారని ఫైర్ అయయారు. ఆంధ్రాలో విలీనమైన ఏడు మండలాల ప్రజలు మళ్లీ తెలంగాణకు వెళతారా అని ఎవరో అడిగితే మేం వెళ్లమని చెప్పినట్లుగా సజ్జల పేర్కొన్నారు.తెలంగాణలో ఏం లేవో కూడా కేసీఆర్ చెప్పుకుంటే బాగుంటుందని రామకృష్ణారెడ్డి చురకలంటించారు.

ALso Read: ఏపీపై వ్యాఖ్యలు .. తెలంగాణలో లేనివి కూడా చెప్పండి : కేసీఆర్‌కు సజ్జల రామకృష్ణారెడ్డి కౌంటర్

సరిహద్దు గ్రామాల ప్రజలు మాకు ముఖ్యమంత్రిగా జగన్ కావాలి అంటున్నారని.. ఏపీలో పెన్షన్ అద్భుతంగా అమలౌతోందని స్వయంగా కేసీఆర్ చెప్పారని ఆయన గుర్తుచేశారు. ఆంధ్రా మాదిరిగానే తాము కూడా పెన్షన్లు అమలు చేస్తామని కేసీఆర్ అన్నారని సజ్జల ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో కోటి 60 లక్షల కుటుంబాల్లో 40 లక్షల కుటుంబాలకు నేరుగా లబ్ధి జరిగిందని ఆయన తెలిపారు. 

తమ వ్యాపారాలను రక్షించుకునేవాళ్లు హైదరాబాద్‌లో ర్యాలీలో పాల్గొన్నారని సజ్జల ఆరోపించారు. వందో, రెండోందల మందో చంద్రబాబు ర్యాలీకి రాకుండా ఎలా వుంటారని రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. మా ఎమ్మెల్యే వెళ్లినా అంతకంటే ఎక్కువ మంది వస్తారని ఆయన చురకలంటించారు. రోగం వచ్చింది ఆసుపత్రికి వెళ్తానన్న చంద్రబాబు.. 14 గంటలు కారులో ఎలా కూర్చొన్నారని సజ్జల ప్రశ్నించారు. 

వ్యాధులు వున్నాయని కోర్టుకు అబద్ధాలు చెప్పి బెయిల్ తెచ్చుకున్నాడని.. ఎన్నో సర్వేల్లో జగన్‌కు 60 నుంచి 70 శాతం ప్రజామద్ధతు వుందని తేలుతోందని రామకృష్ణారెడ్డి తెలిపారు. ఎంతమంది కలిసొచ్చిన మిగిలిన ఆ 30 శాతం ఓట్లు పంచుకోవడమేనని.. మన కోసం నిలబడిన నాయకుడికి అండగా నిలబడాలని సజ్జల పిలుపునిచ్చారు. 

Follow Us:
Download App:
  • android
  • ios