కౌంటర్: సీటిస్తే టిడిపిలో చేరుతానని హమీ: దేవినేని సంచలనం

First Published 14, Jun 2018, 11:34 AM IST
Ap minister Devineni Uma maheshwar rao reacts on Kanna Laxminarayana comments
Highlights

కన్నాపై దేవినేని హట్ కామెంట్స్

అమరావతి: సీటిస్తే తమ పార్టీలో చేరేందుకు సిద్దంగా ఉన్నానని  తమతో రాయబారాలు నడిపిన  కన్నా లక్ష్మీనారాయణ ఢిల్లీకి వెళ్ళిన టిడిపిపై, ఏపీ సీఎం చంద్రబాబునాయుడుపై  విమర్శలు  చేయడం విడ్డూరగా ఉందని ఏపీ రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమా మహేశ్వర్ రావు చెప్పారు.

గురువారం నాడు ఆయన  అమరావతిలో మీడియతో మాట్లాడారు.  ఎన్నికల సమయంలో రాష్ట్రానికి ఇచ్చిన హమీలను కేంద్రం అమలు చేయలేదన్నారు. కానీ,  హమీలను నెరవేర్చినట్టుగ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన చెప్పారు. తాను కోరుకొన్న సీటిస్తే తమ పార్టీలో చేరేందుకు సిద్దగా ఉన్నానని చెప్పిన కన్నా లక్ష్మీనారాణ బిజెపి రాష్ట్ర అధ్యక్ష పదవి దక్కిందని ఢిల్లీలో టిడిపిపై , చంద్రబాబునాయుడుపై విమర్శలు చేయడంపై దేవినేని మండిపడ్డారు.

పోలవరం ప్రాజెక్టుపై వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలను ఆయన తప్పుబట్టారు. పోలవరం ప్రాజెక్టుపై జగన్ కు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ఆయన చెప్పారు. పోలవరం ప్రాజెక్టులో 9 వేల కోట్ల పనులు జరిగితే ప్రాజెక్టు పనులు నత్తనడకన సాగుతున్నాయని చెప్పడం సరికాదన్నారు.  

పోలవరం ప్రాజెక్టుపై జగన్ చేసిన వ్యాఖ్యలు, కార్మికులను, ఇంజనీర్లను అవమానపర్చేలా ఉన్నాయని ఆయన మండిపడ్డారు. ఇప్పటికే గోదావరి డెల్టాకు 5 టిఎంసిల నీరిచ్చినట్టు ఆయన చెప్పారు. గోదావరి నది ప్రవాహం పెరిగితే పట్టిసీమకు నీటిని విడుదల చేయనున్నట్టు ఆయన చెప్పారు.
 

loader