Asianet News TeluguAsianet News Telugu

హక్కులతో పాటు బాధ్యతలు కూడా తెలియాలి: హైకోర్టుకు సమాధానిమిస్తానన్న బొత్స

ఏపీ హైకోర్టు ఇచ్చిన నోటీసుకు సమాధానమిస్తానని ఏపీ రాష్ట్ర మున్సిఫల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు.

AP minister Botsa Satyanaraya reacts on High court notice lns
Author
Amaravathi, First Published Mar 23, 2021, 2:57 PM IST


అమరావతి:ఏపీ హైకోర్టు ఇచ్చిన నోటీసుకు సమాధానమిస్తానని ఏపీ రాష్ట్ర మున్సిఫల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు.ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ మంగళవారం నాడు మీడియాతో మాట్లాడారు,.

ప్రివిలేజ్ కమిటీ పరిధిలోకి రానని ప్రకటించిన ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారాన్ని ప్రివిలేజ్ కమిటీ చూసుకొంటుందన్నారు.ఏపీ హైకోర్టు నోటీసులు ఇచ్చిన విషయం తనకు ఇప్పుడే తెలిసిందన్నారు.  నిమ్మగడ్డకు చెందిన విషయాలు ఏమి  ఎలా లీకయ్యాయో అర్ధం కావడం లేదన్నారు.

also read:గవర్నర్‌కు ఏపీ ఎస్ఈసీ రాసిన లేఖలు లీక్: బొత్స, పెద్దిరెడ్డిలకు ఏపీ హైకోర్టు నోటీసులు

ఎవరికైనా హక్కులతో పాటు బాధ్యతలు కూడా తెలియాలని ఆయన పరోక్షంగా నిమ్మగడ్డపై విమర్శలు గుప్పించారు. గవర్నర్ కు రాసిన లేఖలు లీకయ్యాయని.. ఈ విషయమై సీబీఐ విచారణ జరిపించాలని కోరుతూ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై ఇవాళ ఏపీ హైకోర్టు విచారణ నిర్వహించింది. మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణలకు నోటీసులు జారీ చేసింది హైకోర్టు.

Follow Us:
Download App:
  • android
  • ios