ఏపీ పంచాయితీ రాజ్ శాఖమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణలకు ఏపీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. 

అమరావతి: ఏపీ పంచాయితీ రాజ్ శాఖమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణలకు ఏపీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. గవర్నర్ కు తాను రాసిన లేఖలు లీక్ కావడంపై సీబీఐ విచారణ కోరుతూ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఏపీ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ పై మంగళవారం నాడు విచారణ జరిగింది.

Scroll to load tweet…

తాను గవర్నర్ కు రాసిన లేఖలు ఎలా లీకయ్యాయని నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రశ్నించారు. గవర్నర్ కార్యాలయ ప్రిన్సిపల్ సెక్రటరీ కూడ ఈ విషయమై ఓ ప్రకటన చేసిన విషయాన్ని ఎస్ఈసీ తరపు న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. తమ కార్యాలయం నుండి ఎలాంటి లేఖలు లీకు కాలేదని ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రకటించారని తెలిపారు.

మరోవైపు ఈ లేఖలు సోషల్ మీడియాలో కూడ దర్శనమిస్తున్నాయని ఎస్ఈసీ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఈ విషయమై విచారణ జరపాలని ఎస్ఈసీ తరపు న్యాయవాది కోరారు.గవర్నర్ కు ఎస్ఈసీ రాసిన లేఖలు ఎలా వచ్చాయనే విషయమై మంత్రులకు జారీ చేసిన లేఖలో కోర్టు ప్రశ్నించినట్టుగా తెలుస్తోంది. ఈ విషయమై మంత్రులు ఏ రకంగా స్పందిస్తారో చూడాలి.

ఈ కేసు విచారణను ఈ నెల 30వ తేదీన హైకోర్టు వాయిదా వేసింది.