వైసీపీ నేతలపై అఖిలప్రియ బంధువుల దాడి

ap minister bhuma akhila priya relatives attack on ycp leaders
Highlights

తీవ్రగాయాలపాలైన వైసీపీ నేతలు


వైసీపీ నేతలపై మంత్రి అఖిలప్రియ బంధువులు దాడికి పాల్పడ్డారు. కర్రలు, కత్తులతో దాడి చేయడంతో.. వైసీపీ నేతలు తీవ్రగాయాలపాలయ్యారు.  పొలం వివాదంలో ఈ ఘటన చోటుచేసుకుంది.ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు  ఇలా ఉన్నాయి.

పొలం పంచాయితీ ఉందని మాట్లాడటానికి రావాలంటూ వైసీపీ నేతలు కేఈ శ్రీనివాస్ గౌడ్‌ను, అతడి సోదరులను కొందరు టీడీపీ నేతలు, మంత్రి అఖిల ప్రియ బంధువులు పిలిపించారు. వైసీపీ నేతలు వారు చెప్పిన చోటుకు రాగానే టీడీపీ వర్గీయులు కర్రలు, కత్తులతో దాడికి పాల్పడ్డారు. 

టీడీపీ నేతల దాడిలో తీవ్రంగా గాయపడ్డ కేఈ శ్రీనివాస్‌ గౌడ్‌ అతడి సోదరులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. బాధితులు మీడియాతో మాట్లాడుతూ.. దొర్నిపాడు మండలం కొత్తపల్లెకు చెందిన భూమా బ్రహ్మం, అతడి కుమారులు సహా మరో 20 మంది తమపై విచక్షణా రహితంగా దాడి చేశారని ఆరోపించారు. పాత కక్షలు ఉండటం, దాంతో తాము అధికారంలో ఉన్నామని టీడీపీ శ్రేణులు దాడి చేశాయని కేఈ శ్రీనివాస్‌ సన్నిహితులు వాపోయారు. 
 

loader