శ్రీకాకుళం: ఏపీ మంత్రి అచ్చెన్నాయుడుకు ప్రమాదం నుంచి బయటపడ్డారు. శ్రీకాకుళం జిల్లాలో తెలుగుదేశం పార్టీ బైక్ ర్యాలీ నిర్వహించింది. ఈ ర్యాలీలో పాల్గొన్న మంత్రి ఎస్కార్ట్ వాహనంపై ఒక్కసారిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హోర్డింగ్ పడింది. 

అయితే ఈ ప్రమాదంలో మంత్రి అచ్చెన్నాయుడు తృటిలో తప్పించుకున్నారు. అప్పటికే మంత్రి అచ్చెన్నాయుడు వాహనం ముందుకు వెళ్లిపోవడంతో వెనుక వచ్చిన కార్యకర్తలపై హోర్డింగ్ పడింది. దీంతో నలుగురు కార్యకర్తలకు స్వల్ప గాయాలయ్యాయి. మంత్రికి ఎలాంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.