‘వారి పేరు పలకడమే దరిద్రం’

‘వారి పేరు పలకడమే దరిద్రం’

ఏపీ మంత్రి ఆదినారాయణ రెడ్డి.. వైసీపీ నేత సుధీర్ రెడ్డిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.  తనను విమర్శించే స్థాయిలేని వారి పేర్లను పలకడం కూడా దరిద్రమేనని ఆయన అన్నారు. తనపై విమర్శలు చేసిన జమ్మలమడుగు వైసీపీ ఇంఛార్జ్ సుధీర్ రెడ్డిని ఉద్దేశించి పై వ్యాఖ్యలు చెప్పారు.

ఇటీవల సుధీర్ రెడ్డి.. ఆదిపై పలు విమర్శలు చేశారు. దీనిపై తాజాగా ఆది స్పందించారు. అసలు సుధీర్ రెడ్డి తన స్థాయికి తగడని ఆయన పేర్కొన్నారు. అలాంటివారికి తన అనుచరులే సమాధానం చెబుతారని అన్నారు. గుడ్డెద్దు చేలో పడ్డట్టు విమర్శలు చేసేటప్పుడు తెలుసుకుని చేయాలన్నారు. ఒక గ్యాస్‌ కనెక్షన్‌ రూ.5వేలకు పైబడి అమ్మేసమయంలో తాను మహిళలకు రూ.2500లకే ఇప్పించానన్నారు. రూ.5వేలు చేసే కుట్టుమిషన్‌ను రూ.2,500లకే ఇప్పించానన్నారు.
 
కుట్టుమిషన్లు పనిచేయలేదంటే గొంతుకోసుకుంటానని ఆవేశంతో విమర్శించారు. అక్కడే ఉన్న కుట్టుమిషన్‌ శిక్షకురాలితో, కుట్టుమిషన్లు తీసుకున్న మహిళతో మాట్లాడారు. కుట్టుమిషన్లు పనిచేసినట్లైతే చప్పట్లతో హర్షం వ్యక్తం చేయాలని మహిళలను కోరారు. అభివృద్ధి అంటనే వారికి తెలియదని, వారు అభివృద్ధికి అడ్డుపడుతున్నారన్నారు. తన అనుచరులు, ఛైర్మన్‌ ముసలయ్య, ఇతరులకు తాను ఎలాంటి అభివృద్ధి చేసింది తెలుసునని, తనను విమర్శించిన వ్యక్తి సవాల్‌కు వారే సమాధానం చెబుతారన్నారు. అనంతరం నరగపంచాయతీ ఛైర్మన్‌ ముసలయ్య మాట్లాడుతూ అభివృద్ధి విషయంలో తాము ఎక్కడైనా ఎప్పుడైనా చర్చకు సిద్ధమని ప్రకటించారు.
 

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos

MORE FROM Andhra Pradesh

Next page