DSC 2025 Final Results: ఆంధ్ర‌ప్ర‌దేశ్ మెగా డీఎస్సీ 2025 తుది ఫలితాలు విడుదలయ్యాయి. 16,347 ఉపాధ్యాయ పోస్టుల నియామకానికి 3.36 లక్షల మంది దరఖాస్తు చేశారు.

DSC 2025 Final Results: ఆంధ్ర‌ప్ర‌దేశ్ మెగా డీఎస్సీ 2025 తుది ఫలితాలను ప్రభుత్వం సోమ‌వారం విడుదల చేసింది. మొత్తం 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం ఈ పరీక్షలు నిర్వహించారు. మెగా డీఎస్సీ కన్వీనర్‌ ఎం.వి. కృష్ణారెడ్డి ప్రకటన ప్రకారం, అభ్యర్థులు తమ ఫలితాలను పాఠశాల విద్యాశాఖ అధికారిక వెబ్‌సైట్‌లో చూడవచ్చు.

ఈ నియామకానికి మొత్తం 3,36,307 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. జూన్ 6 నుంచి జులై 2 వరకు 23 రోజుల పాటు పరీక్షలు రెండు సెషన్లలో విజయవంతంగా పూర్తయ్యాయి. ఏపీతో పాటు తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఒడిశా రాష్ట్రాల్లోనూ పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. హాజరు శాతం 92.90గా నమోదైంది.

అభ్యర్థుల నుంచి వచ్చిన అభ్యంతరాలను పరిశీలించిన తర్వాత సవరించిన తుది కీ ఆధారంగా నార్మలైజేషన్ ప్రక్రియతో ఈ ఫలితాలను సిద్ధం చేశారు. ఫలితాలతో పాటు స్కోర్‌కార్డులు కూడా వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి.

టెట్ వివరాల్లో ఏవైనా పొరపాట్లు ఉంటే, అభ్యర్థులు హాల్ టికెట్ నంబర్‌ను ఎంటర్ చేసి సరిచేసుకునే అవకాశం కల్పించారు. ఇది ఆగస్టు 13, 2025 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.

ఆంధ్ర‌ప్ర‌దేశ్ మెగా డీఎస్సీ 2025 తుది ఫలితాలు ఎలా తెలుసుకోవాలి?

1. ముందుగా, అధికారిక వెబ్‌సైట్ apdsc.apcfss.in ను సందర్శించండి.

2. హోమ్ పేజీలో "AP DSC Results 2025" అనే లింక్‌పై క్లిక్ చేయండి.

3. మీకు ఇదివ‌ర‌కు కేటాయించిన యూజ‌ర్ నేమ్, పాస్ వ‌ర్డ్ ను ఎంట‌ర్ చేయండి. త‌ర్వాత క్యాప్చ కూడా ఎంట‌ర్ చేయండి.

4. "Submit" బటన్‌పై క్లిక్ చేయండి.

5. మీ ఫలితం స్క్రీన్‌పై కనిపిస్తుంది. భవిష్యత్ అవసరాల కోసం దాన్ని డౌన్‌లోడ్ చేసుకుని ప్రింటవుట్ తీసుకోండి.

డీఎస్సీ 2025 ఫలితాలు తెలుసుకోవడం కోసం ఇక్కడ క్లిక్ చేయండి: DSC 2025 Final Results