కృష్ణాజిల్లాలో టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య సర్పంచ్ నామినేషన్లలో ఘర్షణ జరిగింది. ఇరువర్గాలు మాటా మాటా అనుకుని అది తోపులాటకు దారి తీసింది. వెంటనే పోలీసులు రావడంతో గొడవ సద్దుమణిగింది.
కృష్ణాజిల్లాలో టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య సర్పంచ్ నామినేషన్లలో ఘర్షణ జరిగింది. ఇరువర్గాలు మాటా మాటా అనుకుని అది తోపులాటకు దారి తీసింది. వెంటనే పోలీసులు రావడంతో గొడవ సద్దుమణిగింది.
"
దీనిమీద కృష్ణజిల్లా, బాపులపాడు పంచాయతీ రిటర్నింగ్ ఆఫీసర్ మల్లిఖార్జునరావు వివరణ ఇచ్చారు. శనివారం సర్పంచ్ అభ్యర్థుల నామినేషన్లు స్క్రూటినీ చేస్తున్నామని, ఈ నేపథ్యంలో టీడీపీ, వైసీపీ ఇరు వర్గాలూ ఒకరిమీద ఒకరు ఫిర్యాదు చేసుకున్నారని తెలిపారు.
అయితే ఇరువర్గాల అభ్యర్థుల పత్రాలు సరిగానే ఉన్నాయని వారికి సర్దిచెప్పి పంపేశామని, నామినేషన్ పత్రాలు అన్నీ బాగా చెక్ చేసిన తరువాత పత్రాలను అంగీకరించామని తెలిపారు.
అయితే అది పెద్ద గొడవ కాదని వాళ్లూ వాళ్లూ ఏదో అనుకున్నారు అంతే అని తెలిపారు.