Asianet News TeluguAsianet News Telugu

ఏ అధికారి కూడా పనిచేయరు: నిమ్మగడ్డకు పెద్దిరెడ్డి కౌంటర్

ఏపీ ఎస్ఈసీ గ్రామ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయడంపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి స్పందించారు. ఏ అధికారి కూడా ఎస్ఈసీ అదేశాలను అమలు చేయబోరని ఆయన చెప్పారు.

AP Local bodies elections: Peddireddy Ramachandra Reddy counters Nimmagadda Ramesh Kumar
Author
Amaravathi, First Published Jan 23, 2021, 2:04 PM IST

అమరావతి: ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) నిమ్మగడ్డ రమేష్ కుమార్ గ్రామ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయడంపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తీవ్రంగా ప్రతిస్పందించారు. సుప్రీంకోర్టు ఆదేశాలు వచ్చే వరకు ఉద్యోగులు ఎవరు కూడా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆదేశాలను అమలు చేయబోరని ఆయన స్పష్టం చేశారు. 

ఉద్యోగులు భయాందోళనలో ఉన్నారని ఆయన చెప్పారు.  సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని, ఆ తర్వాతనే ఎన్నికల గురించి ఆలోచిస్తుందని ఆయన చెప్పారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రతిపక్ష నేత చంద్రబాబు చెప్పినట్లే వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు. కలెక్టర్లూ ఎస్పీలపై నిమ్మగడ్డ ఎలా చర్యలు తీసుకుంటారని ఆయన ప్రశ్నించారు. 

Also Read: నిమ్మగడ్డపై ఏపీ ఎన్జీవో, ఉద్యోగ సంఘాలు ఫైర్.. అవసరమైతే సమ్మె చేస్తాం

గ్రామ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయడంపై వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు తీవ్రంగా స్పందించారు. సిద్ధంగా లేమని ప్రభుత్వం చెప్పిన తర్వాత కూడా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎందుకు పట్టింపుతో వెళ్తున్నారని ఆయన శనివారం మీడియా సమావేశంలో ప్రస్నించారు. 

Also Read: నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు కౌంటర్: వెంకట్రామి రెడ్డి సంచలన వ్యాఖ్యలు

2018లో ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా చంద్రబాబుకు నష్టమని నిర్వహించలేదని ఆయన అన్నారు. అప్పుడు నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎందుకు బాధ్యతలు నిర్వహించలేదని ఆయన అడిగారు. అప్పుడు లేని ఆతురత ఇప్పుడెందుకని ఆయన అడిగారు. కోవిడ్ వ్యాపిస్తున్న తరుణంలో ఎన్నికలు నిర్వహించడం అవసరమా అని ఆయన అడిగారు. 

Follow Us:
Download App:
  • android
  • ios