Asianet News TeluguAsianet News Telugu

చంద్రబాబు నన్నేమీ పీకలేరు: మండలిలో మంత్రి అనిల్ సవాల్

నిన్న మండలిలో మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కోపంతో ఊగిపోయారు. నన్నేమీ పీకలేరు అంటూ ప్రతిపక్షనేతలపై మంది పడ్డారు. సొంతపార్టీ మంత్రులు వారిస్తున్నప్పటికీ... అనిల్ మాత్రం వెనక్కి తగ్గలేదు. 

AP Legislative Council: Minister Anil Kumar Yadav Abusive Language, challenges Chandrababu
Author
Amaravathi, First Published Jun 18, 2020, 7:55 AM IST

నిన్న ఆంధ్రాప్రదేశ్ శాసనమండలిలో అధికార ప్రతిపక్షాలమధ్య మాటలయుద్ధంతోపాటుగా భౌతిక ఘర్షణ కూడా జరిగింది. అన్ని పార్టీల ఎమ్మెల్సీలు బయటకొచ్చి ఇదే విషయం గురించి చెప్పారు. 

ఇకపోతే నిన్న మండలిలో మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కోపంతో ఊగిపోయారు. నన్నేమీ పీకలేరు అంటూ ప్రతిపక్షనేతలపై మంది పడ్డారు. సొంతపార్టీ మంత్రులు వారిస్తున్నప్పటికీ... అనిల్ మాత్రం వెనక్కి తగ్గలేదు. 

తొలుత అచ్చెన్నాయుడు అరెస్ట్ బీసీ వ్యవహారం నుంచి మొదలై మండలి మంచి కాక మీద ఉన్న సమయంలో ఎమ్మెల్సీకి దీపక్ రెడ్డి... మంత్రులు గడ్డలు పెంచుకొని రౌడీల్లా ఉన్నారని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారని అన్నాడు. దీనిపై అనిల్ కుమార్ యాదవ్ సీరియస్ గా ఫైర్ అయ్యారు. 

‘‘అధ్యక్షా! తమరూ గడ్డం పెంచారు.అంతమాత్రాన రౌడీనా? చంద్రబాబు కూడా గడ్డం పెంచుతున్నారు. ఆయన రౌడీనా?’’ అని అన్నారు. కార్మికుల సొమ్ము తిన్న 150 కోట్ల రూపాయల స్కామ్‌లో తప్పు చేసినందునే అచ్చెన్నాయుడును అరెస్టు చేశారని, నేరం చేస్తే బీసీ అని అరెస్టు చేయడం మానేస్తారా అంటూ అనిల్‌కుమార్‌ ప్రశ్నించారు.

ఇంతలోనే... టీడీపీ ఎమ్మెల్సీ నాగజగదీశ్వరరావు బెట్టింగ్‌ అంశాన్ని ప్రస్తావించారు. దీనిపై అనిల్‌కుమాల్‌ ఆగ్రహంతో ఊగిపోయారు. ‘‘చంద్రబాబు హయాంలో నా ప్రతిష్ఠను దెబ్బ తీసేందుకే బెట్టింగ్‌ ఆరోపణలతో నోటీసులు ఇచ్చారు. నేను పోలీసు స్టేషన్‌కు వెళితే చిన్న కేసుకూడా పెట్టలేకపోయారు’’ అని అనిల్ తీవ్ర స్వరంతో అన్నారు.

‘‘నాకు నోటీసు ఇచ్చిన వెంటనే పోలీసు స్టేషన్‌కు వెళ్లాను. ఎప్పుడో 2014లో వాళ్లు నాకు ఎలెక్షన్‌ ఫండ్‌ ఇచ్చారట! బెట్టింగ్‌లో సంబంధం లేదని వాళ్లే అన్నారు’’ అని అనిల్‌ కుమార్ యాదవ్ కోపంతో ఊగిపోతూ అన్నారు. 

మరోసారి నాగ జగదీశ్వర్ రావు మాట్లాడుతూ.... ‘‘మా నాయకుడు చంద్రబాబు మంచోడు కాబట్టే కేసులు పెట్టలేదు’’ అని వ్యాఖ్యానించారు. దీనిపై అనిల్‌ తీవ్రంగా ఫైర్ అయ్యారు. ‘‘నన్నేమీ పీకలేరు. చాలెంజ్‌ చేస్తున్నా’’ అంటూ అనిల్‌ తొడగొట్టారు. దీంతో, సభ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. సీనియర్‌ మంత్రులూ, ఇతరులూ అనిల్‌ను వారించేలా గట్టిగా అరిచారు. అయినా, అనిల్‌ వెనక్కి తగ్గలేదు. ‘‘నన్ను చంద్రబాబేమీ పీకలేరు. నాకు వ్యతిరేకంగా 100 కోట్ల రూపాయలు కుమ్మరించారు. అయినా, తుక్కుగా ఓడిపోయారు’’ అంటూ ఆగ్రహించారు.

ఇక అనిల్ కుమార్ తీవ్రపదజాలం వాడడంతో దానిని రెకార్డులనుంచి తొలగించాలని టీడీపీ కోరగా, మంత్రి బొత్స కూడా అసందర్భంగా ఉన్నవాటిని రికార్డుల నుంచి తొలగించాలని కోరుతున్నట్టు అన్నారు. 

టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ.... అనిల్ కుమార్ యాదవ్ జిప్ తీస్తూ నన్నేమి పీకలేరు అనే వ్యాఖ్యలు చేసారని, మహిళా ఎమ్మెల్సీల ముందు ఇలా ప్రవర్తించడం సరికాదని అన్నారు. అందుకే చైర్మన్ ను ఆ వ్యాఖ్యలు సభారికార్డుల నుంచి తొలగించాలని కోరినట్టు తెలిపారు. 

Follow Us:
Download App:
  • android
  • ios