అమరావతి: పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ ఎమ్మెల్సీ పదవులకు చేసిన రాజీనామాలను శాసనమండలి ఛైర్మెన్  బుధవారం నాడు ఆమోదించారు. ఈ మేరకు రెండు ఎమ్మెల్సీ పదవులు ఖాళీగా ఉన్నట్టు అసెంబ్లీ సెక్రటరీ ఇవాళ నోటిఫికేషన్ జారీ చేశారు.

గత నెల 19వ తేదీన జరిగిన ఎన్నికల్లో ఎంపీగా మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్ లు ఎన్నికయ్యారు. దీంతో ఎమ్మెల్సీ పదవులకు వారిద్దరూ రాజీనామా చేశారు.

జగన్ మంత్రివర్గంలో పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణలు మంత్రులుగా కొనసాగుతున్నారు. శాసనమండలిని రద్దు చేయాలనే ఉద్దేశ్యంతో ఈ ఇద్దరిని జగన్ రాజ్యసభకు పంపారు.

also read:ఎమ్మెల్సీ, డిప్యూటీ సీఎం పదవికి పిల్లి సుభాష్ చంద్రబోస్ రాజీనామా

దీంతో వీరిద్దరూ ఇవాళ ఎమ్మెల్సీ పదవులకు రాజీనామాలను మండలి చైర్మెన్ కు అందించారు. మంత్రి పదవులకు కూడ రాజీనామాలు చేశారు. మంత్రి పదవులకు ఇచ్చిన రాజీనామా పత్రాలను సీఎం జగన్ కు అందించారు. 

రెండు ఎమ్మెల్సీ పదవులు ఖాళీగా ఉన్నట్టుగా అసెంబ్లీ కార్యదర్శి ఇవాళ నోటిఫికేషన్ విడుదల చేశారు. గత నెలలో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో ఏపీ నుండి నాలుగు స్థానాల్లో వైసీపీ అభ్యర్థులు విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధి వర్ల రామయ్య పోటీ చేసినా ఆ పార్టికి ఉన్న సంఖ్య మేరకు కూడ ఓట్లు దక్కలేదు.