Asianet News TeluguAsianet News Telugu

మూడు ఫిర్యాదులు, ఆరు ముష్టిఘాతాలు: మండలిలో గతసీన్ రిపీట్, నిరవధిక వాయిదా!

మూడు రాజధానుల బిల్లప్పుడు అధికార విపక్షాలు ఎలా  ఎలాంటి హింసాత్మక సంఘటనలు చోటుచేసుకున్నాయో.... ఈసారి కూడా అదే విధముగా అధికార ప్రతిపక్షాలు మరోసారి వ్యూహ ప్రతివ్యూహాలను సిద్ధం చేసుకుని అదే సీన్ ను రిపీట్ చేసాయి. 

AP Legislative Council Adjourned Without Passing Appropriation Bill
Author
Amaravathi, First Published Jun 17, 2020, 9:22 PM IST

ఆంధ్రప్రదేశ్ శాసనమండలి నిరవధికంగా వాయిదాపడింది. మండలిలో గతంలో మూడు రాజధానుల బిల్లప్పుడు అధికార విపక్షాలు ఎలా  ఎలాంటి హింసాత్మక సంఘటనలు చోటుచేసుకున్నాయో.... ఈసారి కూడా అదే విధముగా అధికార ప్రతిపక్షాలు మరోసారి వ్యూహ ప్రతివ్యూహాలను సిద్ధం చేసుకుని అదే సీన్ ను రిపీట్ చేసాయి. 

సభ అస్తవ్యస్తంగా మారడంతో చైర్మన్  పాలనావికేంద్రీకరణ బిల్లును, సీఆర్డీఏ రద్దు బిల్లును సెలెక్ట్ కంపెనీకి పంపగా, ద్రవ్య వినిమయ బిల్లు కూడా పాస్ అవకుండానే సభను నిరవధికంగా వాయిదా వేశారు. 

అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చించాలని సభలో టీడీపీ ఎమ్మెల్సీలు పట్టుబట్టారు. అయితే దానికంటే ముందే రాజధాని బిల్లులను పరిగణనలోకి తీసుకోవాలని చైర్మన్‌ను అధికార వైసీపీ కోరింది. 

దీంతో ఇరు పక్షాల మధ్య వాగ్వదం జరిగింది. అజెండా ప్రకారం వెళ్లాల్సిందేనని టీడీపీ సభ్యులు పట్టుబట్టారు.అంతకుమునుపు కూడా సభలో ఏ బిల్లు ముందు పెట్టాలన్న విషయంలో ఆర్ధికమంత్రి బుగ్గన, మండలి ప్రతిపక్షనేత యనమల, మంత్రి బొత్స మధ్య తీవ్రమాటల యుద్ధం జరిగింది. 

అన్నిటికంటే ముఖ్యమైనది, అత్యవసరమైనది ద్రవ్య వినిమయ బిల్లు కాబట్టి దాన్నే చర్చకు తీసుకురావాలని, అది గనుక పాస్ కాకపోతే ప్రభుత్వం డబ్బులు డ్రా చేయలేదు కాబట్టి దాన్ని చర్చకు తీసుకురావాలని యనమల అన్నారు. 

కొత్త సాంప్రదాయాలు ఎందుకని బుగ్గన ప్రశ్నించారు. ద్రవ్య వినిమయ బిల్లును గనుక ముందుగా చర్చకు తీసుకుంటే... అది అయిపోగానే సభను నిరవధిక వాయిదా వేసే ప్రమాదం ఉందని వైసీపీ భావించి ముందుగా సీఆర్డీఏ రద్దు బిల్లును, పాలనావికేంద్రీకరణ బిల్లును చర్చకు స్వీకరించాలని కోరాయి. 

సభలో ముందు రాజధాని బిల్లులు పెట్టాలని ప్రభుత్వం, ద్రవ్య వినిమయ బిల్ పెట్టాలని ప్రతిపక్షం ఒకదానికొకటి పట్టుబట్టాయి. వీరి మధ్య తీరా వాగ్వివాదంతోపాటుగా ఒకరిపై ఒకరు పిడిగుద్దులు, ముష్టిఘాతాలు కూడా విసురుకున్నారు. 

టీడీపీ ఎమ్మెల్సీలు సత్యనారాయణరాజు, బీద రవిచంద్ర, మంత్రి వెల్లంపల్లిల మధ్య తీవ్ర పెనుగులాట జరిగింది. ఒకరిపై ఒకరు దాడిచేసుకున్నారు. మొత్తానికి మరోమారు మండలి వాతావరణం రణరంగంగా మారడంతో చైర్మన్ సభను నిరవధికంగా వాయిదా వేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios