ప్రతిపక్షనేత, వైసీపీ అధినేత జగన్ పై ఏపీ  హోం శాఖా మంత్రి నిమ్మకాయల చినరాజప్ప విమర్శల వర్షం కురిపించారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి మాట్లాడే అర్హత కూడా  జగన్ కి లేదని ఆయన అన్నారు. ఈ రోజు కాకినాడలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.

ఎ న్నికల ముందు ఇచ్చిన హామీలను చంద్రబాబు వంద శాతం అమలు చేశారని చెప్పారు. అటువంటప్పుడు ఆయనపై విమర్శలు తగదన్నారు. ‘‘తుఫాన్‌ బాధితుల దగ్గరకు వెళ్లరు. విశాఖ రైల్వే జోన్‌ కోసం కేంద్రంతో పోరాడరు. బీజేపీని వ్యతిరేకించరు. అటువంటి జగన్‌ మాపై విమర్శలు చేస్తారా’’ అని చినరాజప్ప ప్రశ్నించారు. అభివృద్ధి పనులను అడ్డుకుంటున్నది బీజేపీయేనని మండిపడ్డారు.  అభివృద్ధిని అడ్డుకుంటున్న  బీజేపీ నేతలే  మళ్లీ ఏపీకి అన్యాయం జరుగుతుందని వ్యాఖ్యానించడం దారుణమని అన్నారు.