ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్ సర్కార్‌కు హైకోర్టులో మరో ఎదురుదెబ్బ తగిలింది. ప్రకాశం జిల్లాలో మైనింగ్ భూముల లీజును రద్దు చేస్తూ ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది.

బల్లికురవలో బీజేపీ ఎంపీ గరికపాటి రామ్మోహన్ రావుకు ఇచ్చిన మైనింగ్ భూములను రద్దు చేస్తూ ప్రభుత్వం మూడు నోటీసులు ఇచ్చింది. వీటిని ఏపీ హైకోర్టు సస్పెండ్ చేసింది.

పర్యావరణ అనుమతులు లేవని, మైనింగ్‌లో అక్రమాలు జరుగుతున్నాయని లీజు రద్దు చేసిన జగన్ సర్కార్ రూ.217 కోట్ల జరిమానా కట్టాలని నోటీసులు ఇచ్చింది. దీనిపై గరికపాటి రామ్మోహన్ రావు కోర్టును ఆశ్రయించడంతో విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం.. లీజు రద్దు, జరిమానా నోటీసుల్ని సస్పెండ్ చేసింది.