టిడిపి హయాంలో పేద,మధ్యతరగతి ప్రజల ఇళ్ల నిర్మాణం కోసం కేటాయించిన 25ఏకరాల్లోని గృహకల్ప ప్లాట్ల వేలానికి సిద్దపడిన జగన్ సర్కార్ కు ఎదురుదెబ్బ తగిలింది.
అమరావతి: జగన్ సర్కార్ కు హైకోర్టులో మరో ఎదురుదెబ్బ తగిలింది. గతంలో టిడిపి ప్రభుత్వం అధికారంలో వుండగా పేద, మధ్యతరగతి ప్రజల ఇళ్ల నిర్మాణం కోసం విశాఖపట్నంలో 25ఎకరాలను గృహకల్ప ప్లాట్ల కోసం కేటాయించారు. అయితే తాజాగా ఈ ప్లాట్ల వేలానికి జగన్ సర్కార్ నిర్ణయించి నోటిఫికేషన్ కూడా జారీచేసింది. దీనిని వ్యతిరేకిస్తూ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ హైకోర్టును ఆశ్రయించగా అత్యున్నత న్యాయస్థానం స్టే విధించింది.
గృహకల్ప ప్లాట్ లను వేలం వేయడం వల్ల పేద, మధ్యతరగతి వారికి అన్యాయం జరిగే అవకాశముందని హైకోర్టులె దాఖలుచేసిన పిటిషన్ లో ఎమ్మెల్యే రామకృష్ణ పేర్కొన్నారు. వేలంపాటలో ధనికులే ప్లాట్లు కొంటారని... దీంతో పేద మద్యతరగతి వారికోసం నిర్మించిన గృహకల్ప ప్లాట్లు అన్యాక్రాతం అవుతాయిన హైకోర్టు దృష్టికి తీసుకెళ్లాడు. దీంతో ఈ ప్లాట్లు వేలం వేయకుండా హైకోర్టు స్టే విధించింది.
