సోషల్ మీడియాలో న్యాయమూర్తుల మీద అసభ్య పోస్టులపై ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. దేశంలో ఎక్కడా న్యాయమూర్తులపై అసభ్య పోస్టులు పెట్టేలేదని గుర్తుచేసింది. అసభ్య పోస్టులు, కామెంట్ల వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకుంటామని హైకోర్టు హెచ్చరించింది.

అసభ్య పోస్టులు పెట్టేవారికి ఎవరిదో ప్రోద్భలం వుందని, ఇలాంటి వారిపై కేసులు నమోదు చేయాల్సిందిగా సీఐడీని ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణను అక్టోబర్ 6కి వాయిదా వేసింది.

కాగా న్యాయమూర్తులు, న్యాయస్థానాలపై అసభ్య పోస్టులు పెట్టిన  వ్యవహారంపై జూలై 24న హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా పోస్టులు పెట్టినవారిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారని సీఐడీని ధర్మాసనం ప్రశ్నించింది.

ఇప్పటికే విచారణ పూర్తయిందని, ఛార్జిషీట్‌ను సిద్ధం చేస్తున్నామని ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు తెలిపారు. పూర్తి వివరాలతో ప్రమాణపత్రం దాఖలు చేయాలని సీఐడీ అధికారులను న్యాయస్థానం ఆదేశించిన సంగత తెలిసిందే.