ఈఎస్ఐ స్కామ్ కేసులో మాజీ మంత్రి అచ్చెన్నాయుడు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ ఏపీ హైకోర్టు బుధవారం నాడు కొట్టివేసింది.


ఈ కేసులో ఇప్పటికే ఏసీబీ 10 మందిని అరెస్ట్ చేసింది. పది మందిలో ఆరుగురు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. ఈ బెయిల్ పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి బెయిల్ ఇవ్వకూడదని కోరారు. బెయిల్ ఇస్తే  ఆరోపణలు ఎదుర్కొంటున్న వారంతా సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని ఏసీబీ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

అయితే ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నవారికి బెయిల్ ఇవ్వకూడదని ఏసీబీ తరపు న్యాయవాదులు హైకోర్టుకు విన్నవించారు. మరో వైపు ఆరోగ్య సమస్యలను ప్రధానంగా ప్రస్తావిస్తూ అచ్చెన్నాయుడుకు బెయిల్ ఇవ్వాలని ఆయన తరపు న్యాయవాది కోర్టు ముందు వాదించారు. ఏ 1 తరపు నిందితుడు రమేష్ కుమార్ న్యాయవాది ఈ అరెస్టు అక్రమమని హైకోర్టు ముందు వాదించారు. కనీస సమాచారం లేకుండానే అరెస్టు చేశారని ఆయన వాదించారు.

also read:ఈఎస్ఐ స్కామ్: అచ్చెన్న బెయిల్ పిటిషన్ పై తీర్పు రిజర్వ్

ఈఎస్ఐ స్కామ్ లో నిబంధనలకు విరుద్దంగా వ్యవహరించారని మాజీ మంత్రి అచ్చెన్నాయుడుపై ఏసీబీ కేసు  నమోదు చేసింది. ఈ కేసులో భాగంగా ఈ ఏడాది మే 12వ తేదీన ఏసీబీ అరెస్ట్ చేసింది.

తనకు బెయిల్ ఇవ్వాలని కోరుతూ ఏసీబీ కోర్టును ఆశ్రయిస్తే  బెయిల్ నిరాకరించింది. దీంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు.ఈ నెల 27వ  తేదీన ఏసీబీ తరపు న్యాయవాదులు, అచ్చెన్నాయుడు తరపు న్యాయవాదులు బెయిల్ పిటిషన్లపై తమ వాదనలు విన్పించారు. ఇరు వర్గాల వాదనలను విన్న తర్వాత తీర్పును రిజర్వ్ చేసింది హైకోర్టు. 

ఈ  బెయిల్ పిటిషన్ పై తీర్పును బుధవారం నాడు ఇచ్చింది.కోర్టు ఆదేశాల మేరకు ప్రస్తుతం గుంటూరు ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.