ఏపీ మున్సిపల్ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్: పిటిషన్లను కొట్టేసిన హైకోర్టు

రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలపై దాఖలైన అన్ని పిటిషన్లను ఏపీ హైకోర్టు శుక్రవారం నాడు కొట్టేసింది. దీంతో ఎస్ఈసీ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారంగానే ఎన్నికలు జరగనున్నాయి. 
 

AP High court quashes all petitions over municipal elections lns

 రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలపై దాఖలైన అన్ని పిటిషన్లను ఏపీ హైకోర్టు శుక్రవారం నాడు కొట్టేసింది. దీంతో ఎస్ఈసీ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారంగానే ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన ఎన్నికల షెడ్యూల్ ను రద్దు చేయాలని కోరుతూ పలువురు హైకోర్టులో పిటిషన్లను దాఖలు చేశారు. ఇదే అంశంపై 16 పిటిషన్లు దాఖలయ్యాయి.

 

ఈ పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు  ఎన్నికల నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎన్నికలు నిర్వహించొద్దని దాఖలైన పిటిషన్లను ఏపీ హైకోర్టు కొట్టేసింది.ఈ నెల 10వ తేదీన ఏపీ రాష్ట్రంలో  మున్సిపల్ ఎన్నికల కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. 

రాష్ట్రంలోని  12 కార్పోరేషన్లు, 75 మున్సిపాలిటీలకు  ఎన్నికలను నిర్వహించాలని షెడ్యూల్ విడుదల చేసింది.మార్చి 10న పోలింగ్ నిర్వహించాలని ఎస్ఈసీ షెడ్యూల్ విడుదల చేసింది. మార్చి 14న కౌంటింగ్ నిర్వహించనున్నారు.

2019 మార్చి 15న నిలిచిపోయిన పోలింగ్ ప్రక్రియను కొనసాగించేలా ఉత్తర్వులు జారీ చేశారు.అయితే గత ఏడాది షెడ్యూల్ ను రద్దు చేసి  కొత్తగా షెడ్యూల్ విడుదల  చేయాలని పలు పార్టీలు డిమాండ్ చేశాయి. ఈ విషయమై పలువురు పిటిషన్లు దాఖలు చేశారు.


 


 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios