Asianet News TeluguAsianet News Telugu

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు: రికార్డులివ్వాలని పులివెందుల కోర్టుకు ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో రికార్డులను సీబీఐకి అందించాలని ఏపీ హైకోర్టు బుధవారం నాడు పులివెందుల కోర్టును ఆదేశించింది
రికార్డులను ఇవ్వడానికి పులివెందుల మేజిస్ట్రేట్ నిరాకరించడంతో ఏపీ హైకోర్టులో సీబీఐ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.

Ap high court orders to pulivendula court to give record of former minister Ys vivekananda Reddy murder case lns
Author
Amaravathi, First Published Nov 11, 2020, 3:07 PM IST


అమరావతి: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో రికార్డులను సీబీఐకి అందించాలని ఏపీ హైకోర్టు బుధవారం నాడు పులివెందుల కోర్టును ఆదేశించింది
రికార్డులను ఇవ్వడానికి పులివెందుల మేజిస్ట్రేట్ నిరాకరించడంతో ఏపీ హైకోర్టులో సీబీఐ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.

also read:వైఎస్‌ వివేకా హత్య కేసు: హైకోర్టులో సీబీఐ పిటిషన్, ఎందుకంటే?

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో రికార్డులు ఇవ్వాలని కోరుతూ పులివెందుల మేజిస్ట్రేట్ ను సిబీఐ కోరింది. అయితే ఈ విషయమై తమకు ఎలాంటి ఆదేశాలు లేవని రికార్డులు ఇచ్చేందుకు మేజిస్ట్రేట్ నిరాకరించాడు. దీంతో ఈ హత్యకేసులో రికార్డులు ఇవ్వాలని కోరుతూ  సీబీఐ  ఈ నెల 2వ తేదీన ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.

సీబీఐ పిటిషన్ పై విచారణ జరిపిన ఏపీ హైకోర్టు బుధవారం నాడు కీలక ఆదేశాలిచ్చింది. మొత్తం రికార్డులను వెంటనే  సీబీఐకి అప్పగించాలని పులివెందుల మేజిస్ట్రేట్ ను ఆదేశించింది.

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణ బాధ్యతను ఢిల్లీ ప్రత్యేక నేరాల విభాగానికి చెందిన 3వ బ్రాంచీకి అప్పగిస్తూ ఈ ఏడాది అక్టోబర్ 15న నిర్ణయం తీసుకొన్నారు. 

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ ప్రత్యేకంగా ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఈ కేసు విచారణ అధికారిగా డీఎస్పీ దీపక్ గౌర్ ను నియమించింది. ఐపీసీ 302 ప్రకారంగా సీబీఐ కేసును రీ రిజిస్ట్రేషన్ చేసింది.

ఈ కేసు విచారణ కోసం కొత్త సీబీఐ బృందం కడపకు వచ్చింది. తొలుత వివేకా హత్య కేసును సీఆర్‌పీసీ 174 సెక్షన్ కింద అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో సీబీఐ మార్పులు చేసింది. త్వరలోనే  స్పెషల్ టీమ్ దర్యాప్తును ప్రారంభించనుంది.

Follow Us:
Download App:
  • android
  • ios