అమరావతి: రాష్ట్రంలో  కరోనా కేసులు, టెస్టుల విధానం, చికిత్సపై వివరాలు ఇవ్వాలని ఏపీ ప్రభుత్వాన్ని హైకోర్టు గురువారం నాడు ఆదేశించింది.  రాష్ట్రంలో కరోనా కేసులు, చికిత్సలపై  ఏపీ హైకోర్టులో  పిటిషన్ దాఖలైంది.  ఈ పిటిషన్ పై  హైకోర్టు విచారణ నిర్వహించింది.  

also read:కరోనా ఎఫెక్ట్: ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

ఆసుపత్రుల్లో బెడ్స్, ఆక్సిజన్, మెడిసిన్ అందుబాటులో ఉన్నాయా అని కోర్టు ప్రశ్నించింది.  రాష్ట్రంలో కరోనా ట్రీట్ మెంట్ వివరాలను రాష్ట్ర ప్రభుత్వాన్ని కోర్టు కోరింది.  ఈ విషయమై  ఇప్పటివరకు  అఫిడవిట్ దాఖలు చేయకపోవడంపై  ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.  రాష్ట్ర ప్రభుత్వం  అందించే అఫిడవిట్ ఆధారంగా నిర్ణయం తీసుకొంటామని హైకోర్టు ప్రకటించింది.

మరోవైపు ప్రైవేట్ ఆసుపత్రుల్లో ప్రభుత్వం  నిర్ధారించిన ధరల ప్రకారంగానే పీజులు వసూలు చేస్తున్నారా, అధిక ఫీజులు వసూలు చేస్తున్నారా అనే విషయమై హైకోర్టు ప్రశ్నించింది.   ఈ పిటిషన్ పై విచారణను ఈ నెల 27వ తేదీకి వాయిదా వేసింది హైకోర్టు.  రాష్ట్రంలో   కరోనా కేసులు  రోజు రోజుకి పెరిగిపోతున్నాయి.  కరోనా కేసుల వ్యాప్తిని నిరోధించేందుకు గాను తీసుకోవాల్సిన  చర్యలపై   ఏపీ కేబినెట్ సబ్ కమిటీ భేటీ  ఇవాళ సమావేశం నిర్వహించింది.