అమరావతి: చంద్రబాబునాయుడు ప్రభుత్వం జారీ చేసిన జీవోను  ఏపీ హైకోర్టు తప్పుబట్టింది.చంద్రబాబునాయుడు ఏపీరాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అప్పటి విపక్షనేత వైఎస్ జగన్ ను లక్ష్యంగా చేసుకొని తీసుకొచ్చిన జీవోపై ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.

రాష్ట్ర భద్ర కమిషన్ లో ప్రతిపక్ష నేతకు ఉన్న స్థానాన్ని తొలగిస్తూ  చంద్రబాబునాయుడు సర్కార్ తీసుకొచ్చిన జీవోను హైకోర్టు తప్పుబట్టింది.ప్రతిపక్ష నేతకు రాష్ట్ర భద్రత కమిషన్ లో స్థానం ఉండాల్సిందేనని.... సుప్రీంకోర్టు కూడ ఈ విషయాన్ని చెబుతున్న విషయాన్ని హైకోర్టు గుర్తు చేసింది.

భద్రత కమిషన్ లో ప్రతిపక్షనేతకు ఉన్న స్థానాన్ని తొలగిస్తూ చంద్రబాబు ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోను సవరించాలని ప్రస్తుత ప్రభుత్వాన్ని ఏపీ హైకోర్టు ఆదేశించింది.

సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు జీవోలో మార్పులు చేయాలని ఏపీ హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. నాలుగు వారాలలోపుగా కొత్త జీవోను జారీ చేయాలని ప్రభుత్వాన్ని కోరింది.

ఈ విషయమై విచారణను నవంబర్ 17వ తేదీకి విచారణను కోర్టు వాయిదా వేసింది. 2006లో ప్రతి రాష్ట్రంలో భద్రత కమిషన్ ను ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు తీర్పు వెల్లడించిన విషయం తెలిసిందే.