మద్య నిషేధంపై కౌంటర్‌కు ఏపీ హైకోర్టు ఆదేశం

మద్యం విక్రయాలపై ఈ నెల 13వ తేదీ లోపుగా కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది ఏపీ హైకోర్టు. మద్యం విక్రయాలతో లిక్కర్ షాపుల వద్ద భౌతిక దూరం పాటించడం లేదని మాతృభూమి పౌండేషన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.

Ap high court orders to file counter affidavit on liquor issue

అమరావతి:మద్యం విక్రయాలపై ఈ నెల 13వ తేదీ లోపుగా కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది ఏపీ హైకోర్టు. మద్యం విక్రయాలతో లిక్కర్ షాపుల వద్ద భౌతిక దూరం పాటించడం లేదని మాతృభూమి పౌండేషన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.

సోమవారం నాడు ఈ పిటిషన్ ను  వీడియో కాన్పరెన్స్ ద్వారా హైకోర్టు విచారణ చేపట్టింది. మద్యం దుకాణాల వద్ద భౌతిక దూరం అమలు చేయడంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందని పిటిషనర్ ఆరోపించారు.

also read:పెరిగిన ధరల ఎఫెక్ట్: ఏపీలో భారీగా పడిపోయిన మద్యం అమ్మకాలు

ఇలాంటి సమయంలో మధ్యనిషేధిస్తే ప్రయోజనం ఉంటుందని పిటిషనర్ అభిప్రాయపడ్డారు. అయితే ఈ విషయమై ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది హైకోర్టు.

అయితే కౌంటర్ దాఖలు చేయడానికి మాత్రం సమయం ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం తరపు న్యాయవాది హైకోర్టును కోరారు. అయితే ఈ విషయమై ఈ నెల 13వ తేదీ వరకు కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది.

ఈ నెల 5వ తేదీన ఏపీ రాష్ట్రంలో మద్యం విక్రయాలను ప్రారంభించింది. మద్యం విక్రయాలు ప్రారంభించిన రోజు 25 శాతం ధరలను పెంచింది సర్కార్. మరునాడు మరో 50 శాతం ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకొన్న విషయం తెలిసిందే.


 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios