అమరావతి: పరిపాల వికేంద్రీకరణ చట్టంపై ఇదివరకు విధించిన స్టేటస్ కో ను ఏపీ హైకోర్టు పొడిగించింది. ఇవాళ మరోసారి పరిపాల వికేంద్రీకరణ చట్టంపై విచారణ జరిపిన న్యాయస్థానం ఆగస్ట్ 27 వరకు స్టేటస్ కో పొడిగిస్తున్నట్లు వెల్లడించారు. 

పరిపాల వికేంద్రీకరణ చట్టంపై ఇదివరకు విధించిన స్టేటస్ కో ఎత్తివేయాలని వైసిపి ప్రభుత్వ తరుపున న్యాయవాది కోరారు. అయితే ఇందుకు అంగీకరించని న్యాయస్థానం  ఆగస్ట్ 27వరకు అంటే మరో రెండువారాలు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. 

ఇక ప్రస్తుతం ఆన్లైన్ లో నిర్వహిస్తున్న విచారణ వల్ల కొన్ని ఇబ్బందులు ఉన్నాయని... అందువల్ల హైకోర్టు నేరుగా విచారణ జరపాలని పలువురు న్యాయవాదులు కోరారు. అయితే   కరోనా కారణంగా నేరుగా హైకోర్ట్ లో వాదనలు వినిపించలేమని ప్రభుత్వం తరుపున న్యాయవాది రాకేశ్ ద్వివేది తెలిపారు. ప్రభుత్వం తరపున ఢిల్లీ నుండి తన వాదనలు వినిపిస్తమన్నారు రాకేశ్ ద్వివేది.

. ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయస్థానం స్టేటస్ కో ను పొడిగించింది. అనంతరం విచారణను ఈ నెల 27 కు వాయిదా వేసిన ధర్మాసనం. తదుపరి విచారణ వరకు ఈ స్టేటస్ కో కంటిన్యూ అవుతుందని వెల్లడించారు. 

read more   నష్టమే కదా: అమరావతిపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన ఏపీ హైకోర్టు

పాలనా వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ బిల్లులకు ఈ ఏడాది జూలై 31వ తేదీన ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదించారు. అయితే ఈ విషయమై అమరావతి రైతులు హైకోర్టును ఆశ్రయించారు. సోమవారం నాడు మూడు పిటిషన్లు దాఖలు చేశారు. ఇవాళ మరో పిటిషన్ కూడ దాఖలైంది. మొత్తం నాలుగు పిటిషన్లు ఈ విషయమై హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లపై ఏపీ హైకోర్టు విచారణ చేపట్టి పాలనా వికేంద్రీకరణ బిల్లు, సీఆర్‌డీఏ రద్దు చేస్తూ ఏపీ గవర్నర్ విడుదల చేసిన గెజిట్ పై 'స్టేటస్ కో విధించింది.

ఈ కేసు విచారణను ఆగష్టు 14వ తేదీకి వాయిదా వేసింది.  ఆగష్టు 14వ తేదీ వరకు స్టేటస్ కో కొనసాగుతోందని హైకోర్టు తెలిపింది. ఈ క్రమంలోనే ఇవాళ మరోసారి విచారణ జరిపిన న్యాయస్థానం స్టేటస్ కో ను తదుపరి విచారణ వరకు పొడిగించింది.