Asianet News TeluguAsianet News Telugu

నిమ్మగడ్డకు హైకోర్టు షాక్: మంత్రి కొడాలి నానికి ఊరట

మీడియాతో మాట్లాడకుండా నిషేధించడమే కాకుండా ఎన్నికల కోడ్ ఉల్లంఘించారంటూ మంత్రి కొడాలి నానిపై కేసు నమోదు చేయాలన్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆదేశాలను తోసిపుచ్చింది హైకోర్టు. 

ap high court  judgement on minister kodali nani petition against sec
Author
Amaravathi, First Published Feb 18, 2021, 12:08 PM IST

 అమరావతి:  మీడియా సమావేశంలో మంత్రి కొడాలి నాని ఎన్నికల కమిషనర్ ను కించపరుస్తూ వ్యాఖ్యలు చేశారన్న కారణంతో ఆయనకు ఎస్ఈసీ షోకాజ్ నోటీసు జారీ చేసిన విషయం తెలిసిందే. దానిపై మంత్రి వివరణ సరిగా లేకపోవడంతో ఆయన్ను మీడియాతో మాట్లాడకుండా నిషేధించడమే కాకుండా ఎన్నికల కోడ్ ఉల్లంఘించారంటూ కేసు నమోదు చేయాలని నిమ్మగడ్డ రమేష్ కుమార్ పోలీసులును ఆదేశించారు. దీంతో మంత్రి హైకోర్టును ఆశ్రయించగా ఊరట లభించింది.  

 తాజాగా మంత్రి కొడాలి నాని పిటిషన్ పై హైకోర్టు తీర్పును వెలువరించింది. మంత్రి మీడియాతో మాట్లాడవచ్చని... అయితే రాష్ట్ర ఎన్నికల సంఘం గురించి కానీ, రాష్ట్ర ప్రదాన ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ గురించి కానీ మాట్లాడవద్దని హై కోర్టు ఆదేశించింది. మంత్రి కొడాలి నాని పిటిషన్‌పై హైకోర్టులో బుధవారమే వాదనలు ముగిశాయి. అయితే తీర్పును  రిజర్వ్ చేసిన న్యాయస్థానంఇవాళ (గురువారం) వెలువరించింది.  

read more   ఎస్ఈసీ ఆదేశాలు: హైకోర్టును ఆశ్రయించిన మంత్రి కొడాలి

గత సోమవారం జరిగిన విచారణ సందర్భంగా హైకోర్టు విచారణను వాయిదా వేసింది.. మంత్రి కొడాలి నాని, ఎన్నికల కమిషన్ తరపు న్యాయవాదులు సమర్పించిన వీడియో టేపులతో ధర్మాసనం సంతృప్తి చెందలేదు. దీంతో పూర్తిస్థాయి వీడియో టేపులను రాతపూర్వకంగా సమర్పించాలని ఆదేశించింది. ఈ కేసును మరింత లోతుగా విచారించాలని భావించిన న్యాయస్థానం.. కోర్టుకు సహాయపడేందుకు అమిస్ క్యూరిని నియమిస్తున్నట్లు తెలిపింది. అమిస్ క్యూరీగా సీనియర్ న్యాయవాదిని నియమిస్తామని తెలిపింది. ఇలా ఈ పిటిషన్ పై ప్రత్యేకంగా విచారణ జరిపిన న్యాయస్థానం చివరకు మంత్రిని అనుకూలంగా తీర్పునిచ్చింది.  
 

Follow Us:
Download App:
  • android
  • ios