ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ హైకోర్టు షాక్ ఇచ్చింది. రేషన్ వాహనాల రంగులు మార్చాలనే ఎస్ఈసీ ఉత్తర్వులపై హైకోర్టు స్టే విధించింది. మార్చి 15వ తేదీ వరకు స్టే అమలులో ఉంటుందని చెప్పింది.

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నకల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు హైకోర్టు షాక్ ఇచ్చింది. రేషన్ వాహనాల రంగుల విషయంలో హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. రేషన్ వాహనాల రంగులను మార్చాలనే ఎస్ఈసీ ఉత్తర్వులపై స్టే విధించింది.

మార్చి 15వ తేదీ వరకు తమ ఉత్తర్వులు అమలులో ఉంటాయని హైకోర్టు తేల్చి చెప్పింది. స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్నందున రేషన్ వాహనాల రంగులు మార్చాలని నిమ్మగడ్డ రేష్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు దాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది.