అమరావతి: విశాఖపట్నంలో కలకలం సృష్టించిన గ్యాస్ లీకేజీ ఘటనకు సంబంధించిన కేసులో దక్షిణ కొరియా బృందానికి ఊరట లభించింది. ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజ్ ఘటనను పరిశీలించడానికి వచ్చిన బృందానికి తిరిగి దక్షిణ కొరియా వెళ్లేందుకు హైకోర్టు అనుమతి లభించింది. 

గత నెల 13న విశాఖ ఎల్జీ పాలిమర్స్ ను పరిశీలించిన 8 మంది విదేశీయుల బృందం విశాఖకు విచ్చేసింది. అయితే వీరు తిరిగి స్వదేశానికి వెళ్లకుండా పోలీస్ నోటీసులు అడ్డువచ్చాయి. దీంతో అప్పటినుండి ఈ బృంద సభ్యులు ఇక్కడేవుంటున్నారు. 

అయితే తిరిగి తమ దేశానికి వెళ్లేందుకు అనుమతించాలంటూ ఈ బృందం ఏపి హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం తిరిగి వెళ్లేందుకు ఆంక్షలతో కూడిన అనుమతులు ఇచ్చింది. పూర్తి వివరాలు సమర్పించిన తర్వాతే స్వదేశానికి వెళ్లాలని ఆదేశించింది. 

పోలీసుల దర్యాప్తుకు సహకరించాలని... ఎప్పుడు అవసరమైన రావాలంటూ షరతులు విధించింది ధర్మాసనం. ఈ షరతులకు అంగీకరిస్తే ఈ బృందాన్ని స్వదేశానికి వెళ్లడానికి అనుమతించాలని సూచించారు.

read more  మీ వద్దకు రానీయలేదు: ఏల్జీ పాలిమర్స్ మృతుల కుటుంబాలకు చంద్రబాబు లేఖలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలకలం సృష్టించిన గ్యాస్ లీకేజీ దుర్ఘటనలో కొందరు రోడ్డుపైనే మృతి చెందగా, మరికొందరు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఇలా ఇప్పటివరకు ఈ ప్రమాదం కారణంగా 13 మంది మృతిచెందగా ఇటీవలేమరొకరి మరణంతో ఆ సంఖ్య 14కిచేరింది. 

 గోపాలపట్నం పరిధిలో గల ఆర్ఆర్ వెంకటాపురంలో గల ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమ నుంచి రసాయన వాయువు లీకై దాదాపు 3 కిలోమీటర్ల మేర విస్తరించాయి.  ఆర్థరాత్రి దాటిన తర్వాత విషవాయువు లీకవడంతో మనుషులే కాదు మూగజీవులు కూడా దాని తీవ్రతకు గురై పడిపోతున్నాయి. మనుషులు అక్కడికక్కడే కుప్ప కూలిపోయిన హృదయవిదారక దృశ్యాలను కూడా కనిపించాయి.

విషయవాయువుతో చర్మంపై దద్దుర్లు, కళ్ల మంటలో, కడుపులో వికారం పుట్టడంతో పాటు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది రావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఇళ్లు వదిలేసి మేఘాద్రి గెడ్డ వైపు పరుగులు తీశారు. 

ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు, రెవెన్యూ అధికారులు, వైద్య సిబ్బంది ఆర్ఆర్ వెంకటాపురం ప్రాంతానికి చేరుకుని ప్రజలను అప్రమత్తం చేశారు. రోడ్డుపైనా, ఇళ్లలో పడిపోయిన వారిని కాపాడి హాస్పిటల్స్ కి తరలించారు. తెల్లవారు జామున 3 గంటల ప్రాంతంలో విషవాయులు లీలకైనట్లు అధికారులు గుర్తించారు.