Asianet News TeluguAsianet News Telugu

ప్రభుత్వాన్ని అలా ఆదేశించాలంటూ అచ్చెన్న పిటిషన్... హైకోర్టు విచారణ

ప్రభుత్వం హాస్పిటల్ లో కాకుండా తనకు ప్రైవేట్ హాస్పిటల్ లో మైరుగైన చికిత్స అందించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాంటూ టిడిపి ఎమ్మెల్యే, మాజీ మంత్రి అచ్చెన్నాయుడు ఏపి హైకోర్టును ఆశ్రయించారు. 

ap high court inquiry on atchannaidu petition
Author
Amaravathi, First Published Jul 6, 2020, 8:57 PM IST

అమరావతి: ప్రభుత్వం హాస్పిటల్ లో కాకుండా తనకు ప్రైవేట్ హాస్పిటల్ లో మైరుగైన చికిత్స అందించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాంటూ టిడిపి ఎమ్మెల్యే, మాజీ మంత్రి అచ్చెన్నాయుడు ఏపి హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ పై ఇవాళ హైకోర్టు విచారణ జరిపింది. అయితే తీర్పును మాత్రం జులై 8వ తేదీ(బుధవారం)కి వాయిదా వేసింది ధర్మాసనం.  

ఈఎస్ఐ స్కాంలో ఈ ఏడాది మే 7వ తేదీన ఏసీబీ అధికారులు అచ్చెన్నాయుడును అరెస్ట్ చేశారు. నిమ్మాడలో అరెస్ట్ చేసి ఆయనను విజయవాడకు తరలించారు. జీజీహెచ్ ఆసుపత్రిలో చికిత్స నిర్వహించిన తర్వాత ఈ నెల 1వ తేదీన ఆయనను గుంటూరు జైలుకు తరలించారు. 

ఇలా జైలులో ఉన్న అచ్చెన్నాయుడును ప్రైవేట్ ఆసుపత్రికి తరలించేందుకు అవకాశం ఇవ్వాలని హైకోర్టులో అచ్చెన్నాయుడు న్యాయవాదులు పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై ఇరువర్గాల వాదనలను విన్న హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది.

read more  ఏసీబీ కోర్టులో చుక్కెదురు: హైకోర్టుకు వెళ్లే యోచనలో అచ్చెన్నాయుడు

ఇక  అచ్చెన్నాయుడు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించగా... ఈ నెల 3వ తేదీన ఏసీబీ కోర్టు ఈ బెయిల్ పిటిషన్ ను కొట్టేసింది. అచ్చెన్నాయుడుకు బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని  ఏసీబీ తరపు న్యాయవాది కోర్టులో వాదించారు. దీంతో అచ్చెన్నాయుడు బెయిల్ పిటిషన్ ను ఏసీబీ కోర్టు కొట్టివేసింది. 

ఈ  తీర్పును సవాల్ చేస్తూ అచ్చన్నాయుడు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ఏసీబీ కస్టడీ పూర్తి కావడంతో వెంటనే బెయిల్ ఇవ్వాలని ఆ పిటిషన్ లో అచ్చెన్నాయుడు తరపు న్యాయవాదులు హైకోర్టును కోరారు. అచ్చెన్నాయుడు ప్రస్తుతం గుంటూరు జైలులో ఉన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios