ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన ఓ జీవో మీద ఈనాడు పత్రిక వేసిన పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. నిరాధారమైన ఆరోపణలని తేల్చింది. 

అమరావతి : ఈనాడు పత్రికకు ఏపీ హైకోర్టులో చుక్కెదురయింది. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఓ జీవో అమలును సవాల్ చేస్తూ ఈనాడు హైకోర్టులో అభ్యర్థన చేసింది. ఆ జీవో ప్రకారం విస్తృత సర్కులేషన్ కలిగి ఉన్న ఏదైనా పత్రికను కొనుక్కునేందుకు వాలంటీర్లకు, సచివాలయాలకు రూ.200లు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం అందజేస్తుంది. అయితే ఈ జీవో అమలు వల్ల సాక్షి దినపత్రికను కొనే అవకాశం ఉందని.. ఆ జీవో అమలును నిలిపివేయాలని ‘ఈనాడు’ పత్రిక కోర్టును అభ్యర్థించింది. అంతేకాదు ఈ జీవో వల్ల గ్రామ, వార్డు వాలంటీర్లు, సచివాలయాలు కొనుగోలు చేసే సాక్షి దినపత్రిక కొనుగోళ్లను పరిగణనలోకి తీసుకోవద్దని ఆడిట్ బ్యూరో సర్కులేషన్ను ఆదేశించాలని కూడా తన అభ్యర్థనలో కోరింది. అయితే, ఈ రెండు అభ్యర్థనలను హైకోర్టు తోసిపుచ్చింది.

ఈనాడు దాఖలు చేసిన ఈ రెండు అనుబంధ వ్యాఖ్యలను హైకోర్టు కొట్టి వేసింది. ఈ పిటిషన్ల మీద ధర్మాసనం ఈ విధంగా స్పందించింది.. ఫలానా పత్రికను మాత్రమే కొనాలని చెప్పి సచివాలయాలు, వాలంటీర్లకు ప్రభుత్వం ఆదేశించినట్లుగా ఎలాంటి ఉత్తర్వులు జారీ కాలేదని తెలిపింది. అంతేకాదు, ఆ జీవోలో పేర్కొన్నట్లుగా 200 రూపాయల ఆర్థిక సహాయాన్ని సచివాలయాలకు వాలంటీర్లకి ఇవ్వడం వెనక.. కేవలం సాక్షి దినపత్రిక మాత్రమే కొనాలన్న లక్ష్యంతోనే ఇస్తున్నారా? అనే విషయం మీద కూడా దర్యాప్తు చేస్తామని.. లోతైన విచారణ చేపట్టిన తర్వాత ఈ విషయాన్ని తేలుస్తామని తెలిపింది. ఈనాడు ఆరోపణలు చేస్తున్నట్లుగా సాక్షి కొనుగోలను పెంచుకునేందుకే.. వైసీపీ ప్రభుత్వం రూ.200 సచివాలయాలు వాలంటీర్లకు ఆర్థిక సహాయం చేస్తుందన్న దానికి ఎలాంటి ఆధారాలు లేవని.. ఈ నిరాధారమైన ఆరోపణలతో ఈ దశలో ప్రాథమిక నిర్ణయానికి రాలేమని స్పష్టం చేసింది.

పెందుర్తిలో ఉద్యోగాల పేరుతో ఘరానా మోసం.. వైసీపీ మహిళా నాయకురాలిపై కేసు నమోదు..!

మంగళవారం ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ నైనాల జయసూర్యలతో కూడిన ధర్మాసనం మద్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఇది సాక్షి- ఈనాడు మధ్య వ్యాపారానికి సంబంధించిన వివాదంగా అనిపిస్తోందని.. ఈ కేసులో ప్రస్తావనకు వచ్చిన కీలక అంశాలను పరిగణలోకి తీసుకుంటే ఇది తెలుస్తోందని ధర్మాసనం అభిప్రాయపడింది. ఇలాంటి వ్యాపార యుద్ధాల్లో సాధారణంగా ఇద్దరి మధ్య జరిగే వివాదంలో కోర్టులు మధ్యంతర ఉత్తర్వుల దశలో అరుదుగా జోక్యం చేసుకుంటాయని తెలిపింది.

సచివాలయాలు, గ్రామ,వార్డు వలంటీర్లకుఏదైనా పత్రిక కొనుగోలు చేయడానికి రూ.2 ఆర్థిక సాయం చేస్తూ జారీ చేసిన జీవో రాజ్యాంగ విరుద్ధమంటూ ఉషోదయ డైరెక్టర్ ఐ వెంకట్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతోపాటు.. ఈ జీవో వల్ల సాక్షి దినపత్రికను సచివాలయాలు, గ్రామ, వార్డు వలంటీర్ల కొనుగోలు చేస్తే.. ఆ సర్కులేషన్ ని పరిగణలోకి తీసుకోవద్దని సర్కులేషన్ను ఆదేశించాలని మరో పిటిషన్ కూడా దాఖలు చేశారు.

అంతేకాదు 2022 జూలై -డిసెంబర్ మధ్యకాలం… ఆ తర్వాత సమయానికి సంబంధించి సాక్షి సర్కులేషన్ అడిట్ చేయకుండా ఏబిసిని ఆపేలా మభ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని మరో అనుబంధ పిటిషన్ దాఖలు చేసింది. హైకోర్టు ఈ రెండు అనుబంధ పిటిషన్ ల మీద విచారణ జరిపి ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత మంగళవారం ఈమెరకు ఉత్తర్వులు ఇచ్చింది.