చంద్రబాబు క్వాష్ పిటిషన్ కొట్టివేత: సీఐడీ కస్టడీ పిటిషన్ పై ఉత్కంఠ

ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై ఏపీ హైకోర్టు ఇవాళ తీర్పును వెల్లడించింది.

  AP High court dismises Chandrababu quash petition lns

అమరావతి:ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ ను ఏపీ హైకోర్టు కొట్టివేసింది.చంద్రబాబు క్వాష్ పిటిషన్ ను కొట్టివేస్తున్నట్టుగా ఏకవాక్యంలో తీర్పును వెల్లడించింది ఏపీ హైకోర్టు.మినీ ట్రయల్ ను హైకోర్టు నిర్వహించలేదని తేల్చి చెప్పింది. 140 మంది సాక్షులను సీఐడీ విచారించిన విషయాన్ని న్యాయమూర్తి తీర్పు కాపీలో వెల్లడించారు. ఇంత జరిగాక  దర్యాప్తును ఆపమని చెప్పలేమని హైకోర్టు అభిప్రాయపడింది. దర్యాప్తు సంస్థకు స్వేచ్ఛ ఇవ్వాలని  ఏపీ హైకోర్టు అభిప్రాయపడింది. 

ఈ కేసులో సీఐడీ తరపు న్యాయవాదుల వాదనతో ఏపీ హైకోర్టు ఏకీభవించింది.ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ స్కాంలో తనపై నమోదైన ఎఫ్ఐఆర్ ను కొట్టివేయాలని, రిమాండ్ ను రద్దు చేయాలని ఏపీ హైకోర్టులో ఈ నెల 13న చంద్రబాబునాయుడు క్వాష్ పిటిషన్ ను దాఖలు చేశారు.  క్వాష్ పిటిషన్ లో పలు అంశాలను  చంద్రబాబు ప్రస్తావించారు.  అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 17 ఏ ప్రకారం గవర్నర్ అనుమతి తీసుకోవాలని కోరారు.

also read:ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసు: సీఐడీ కస్టడీ పిటిషన్ పై నేటి మధ్యాహ్నం తీర్పు

ఈ క్వాష్ పిటిషన్ పై  హరీష్ సాల్వే, సిద్దార్థ్ లూత్రా చంద్రబాబు తరపున వాదించారు.  సీఐడీ తరపును ముకుల్ రోహత్గీ వాదించారు.  ఇరు వర్గాల వాదనలను నాలుగు రోజుల క్రితమే ముగిశాయి.  తీర్పును రిజర్వ్ చేస్తున్నట్టుగా ఏపీ హైకోర్టు ప్రకటించింది. అయితే ఈ పిటిషన్ పై  ఇవాళ తీర్పును వెల్లడించింది. ఇరు వర్గాలకు చెందిన న్యాయవాదులు సుదీర్థంగా వాదనలు వినిపించారు.  ఈ వాదనలు విన్న తర్వాత ఈ క్వాష్ పిటిషన్  ను కొట్టివేస్తున్నట్టుగా  ఏపీ హైకోర్టు ఇవాళ తీర్పును వెల్లడించింది. ఏపీ హైకోర్టు తీర్పు పూర్తి పాఠం వచ్చిన తర్వాత ఈ కేసుపై టీడీపీ చీఫ్ చంద్రబాబు తరపు న్యాయవాదులు  సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది.  ఏపీ హైకోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై  తీర్పు  తర్వాత  సీఐడీ కస్టడీపై  తీర్పును వెల్లడించనున్నట్టుగా  ఏసీబీ కోర్టు ఇవాళ తెలిపిన విషయం తెలిసిందే.

ఈ నెల  9వ తేదీన ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబును ఏపీ సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు.ఈ కేసులో  తనపై దాఖలైన ఎఫ్ఐఆర్, రిమాండ్ ను రద్దు చేయాలని చంద్రబాబు  క్వాష్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.ఈ పిటిషన్ పై సుప్రీంకోర్టులో పేరు మోసిన లాయర్లు వాదనలు వినిపించారు.  ముగ్గురు ప్రముఖ లాయర్లు ఈ కేసులో వాదనలు వినిపించారు.  చంద్రబాబు తరపున ఇద్దరు లాయర్లు  వాదనలు వినిపించారు. సిద్దార్ధ్ లూథ్రా,  హరీష్ సాల్వేలు బాబు తరపున వాదించారు. విదేశాల్లో ఉన్న హరీష్ సాల్వే  వర్చువల్ గా వాదనలు వినిపించారు.  ఈ వాదనలకు సపోర్టుగా సిద్దార్ద్ లూథ్రా వాదించారు. మరో వైపు ఈ వాదనలను  సీఐడీ తరపు న్యాయవాది  ముకుల్ రోహత్గీ తోసిపుచ్చారు.స్కిల్ స్కాంలో అవినీతి జరిగిందని వాదనలు వినిపించారు. ఈ వాదనలను విన్న ఏపీ హైకోర్టు  ఇవాళ తీర్పును వెల్లడించింది. చంద్రబాబు క్వాష్ పిటిషన్ ను కొట్టివేసింది. 

 

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios