ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసు: సీఐడీ కస్టడీ పిటిషన్ పై నేటి మధ్యాహ్నం తీర్పు

ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు కస్టడీపై ఏపీ సీఐడీ దాఖలు  పిటిషన్ పై ఏసీబీ కోర్టు  ఇవాళ మధ్యాహ్నం రెండున్నర గంటలకు తీర్పును వెల్లడించనుంది.

 ACB Court Adjourns  Verdict on  Chandrababu CID Custody Petition  today lns

అమరావతి: ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు కస్టడీ కోరుతూ  సీఐడీ దాఖలు చేసిన పిటిషన్ పై  తీర్పును ఇవాళ మధ్యాహ్నం రెండున్నర గంటలకు వాయిదా వేసింది ఏసీబీ కోర్టు.వాస్తవానికి నిన్ననే సీఐడీ కస్టడీ పిటిషన్ పై ఏసీబీ కోర్టు తీర్పు వెల్లడించాల్సి ఉంది.అయితే  ఏసీ స్కిల్ డెవలప్ మెంట్ కేసుపై ఎఫ్ఐఆర్ ను కొట్టివేయాలని, రిమాండ్ ను రద్దు చేయాలని  కోరుతూ చంద్రబాబు ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.ఈ పిటిషన్ పై  ఇవాళ మధ్యాహ్నం ఒంటిగంటన్నరకు  ఏపీ హైకోర్టు తీర్పును వెల్లడించే అవకాశం ఉంది.

ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబుకు రెండు రోజుల పాటు  రిమాండ్ ను పొడిగించింది ఏసీబీ కోర్టు. ఆ తర్వాత సీఐడీ కస్టడీ పిటిషన్ పై  ఏసీబీ న్యాయమూర్తి ముందు ఇరు వర్గాల న్యాయవాదులు  వాదోపవాదనలు  జరిపారు.

అయితే ఇప్పటికే ఈ విషయమై  ఇరు వర్గాలు వాదనలు పూర్తి చేసిన విషయాన్ని జడ్జి గుర్తు చేశారు. చంద్రబాబును సీఐడీ కస్టడీకి ఎందుకు ఇవ్వవద్దని కోరుతున్నారని ఆయన తరపు న్యాయవాదులను  జడ్జి కోరారు. మరోవైపు చంద్రబాబు కస్టడీని ఎందుకు కోరుతున్నారని కూడ  సీఐడీ తరపు న్యాయవాదులను జడ్జి ప్రశ్నించారు. ఇరువర్గాల న్యాయవాదులు తమ వాదనలను జడ్జి ముందు విన్పించారు. అయితే ఇదే సమయంలో ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో  ఏపీ హైకోర్టులో చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై  ఇవాళ మధ్యాహ్నం ఒకటిన్నర గంటలకు  తీర్పును వెల్లడించే అవకాశం ఉందని  ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఏసీబీ కోర్టు దృష్టికి తీసుకు వచ్చారు. దీంతో  చంద్రబాబును కస్టడీకి తీసుకొనే పిటిషన్ పై  ఏసీబీ కోర్టు  తీర్పును ఇవాళ మధ్యాహ్నానికి వాయిదా వేసింది.

also read:నేనేలాంటి వాడినో దేశం మొత్తం తెలుసు: జడ్జితో చంద్రబాబు

చంద్రబాబు కస్టడీ పిటిషన్ పై నిన్న సాయంత్రం తీర్పు వెలువడే అవకాశం ఉందని భావించారు. కానీ  ఏపీ హైకోర్టులో బాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై తీర్పు నేపథ్యంలో  తీర్పును ఇవాళ్టికి వాయిదా వేశారు. అయితే  ఈ తీర్పు ఇవాళ మధ్యాహ్నం ఒంటిగంటకు వెలువర్చనుంది ఏపీ హైకోర్టు. దీంతో  ఈ తీర్పు తర్వాత  ఏసీబీ కోర్టు చంద్రబాబును సీఐడీ  కస్టడీకి ఇచ్చే విషయమై తీర్పును వెలువర్చనున్నారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios