ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసు: బాబు బెయిల్ పిటిషన్ పై విచారణ నేటి మధ్యాహ్ననికి వాయిదా
ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై విచారణ ఇవాళ మధ్యాహ్ననికి వాయిదా వేసింది ఏపీ హైకోర్టు.
అమరావతి: ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై విచారణను గురువారం నాడు మధ్యాహ్ననికి వాయిదా వేసింది ఏపీ హైకోర్టు.ఏపీ హైకోర్టులో చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై ఇవాళ ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. చంద్రబాబు తరపున సిద్దార్థ్ లూథ్రా వాదనలు వినిపించారు.చంద్రబాబు హెల్త్ కండీషన్‍పై మెమో దాఖలు చేసినట్టుగా హైకోర్టు దృష్టికి సిద్ధార్థ్ లూథ్రా చెప్పారు.వైద్యుల సిఫార్సు చేసిన అంశాలను కోర్టుకు లూథ్రా వివరించారు.చంద్రబాబు ఆరోగ్యం ఇబ్బందిగా మారుతుందని లూథ్రా కోర్టు దృష్టికి తెచ్చారు.చంద్రబాబుకు 2 వారాల మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోరిన లూథ్రా కోరారు.
చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ ఇవ్వవద్దని ఏపీ సీఐడీ తరపున ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు విన్పించారు. సుప్రీంకోర్టు చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ ను తిరస్కరించిందని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అయితే పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలపై సిద్ధార్థ్ లూథ్రా అభ్యంతరం వ్యక్తం చేశారు.మధ్యంతర బెయిల్ పై కింది కోర్టులో తేల్చుకోవాలని సుప్రీంకోర్టు తమకు సూచించిన విషయాన్ని సిధ్దార్థ్ లూథ్రా హైకోర్టు దృష్టికి తెచ్చారు.చంద్రబాబు ఆరోగ్యంపై తాము వైద్యుల నుండి సమాచారం తెలుసుకోవాలని ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి చెప్పారు. మధ్యాహ్ననికి వైద్యుల నివేదిక ఇవ్వనున్నారని సుధాకర్ రెడ్డి తెలిపారు. చంద్రబాబును ఆయన వ్యక్తిగత వైద్యులు పరీక్షించేలా అనుమతించాలని ఆయన తరపు న్యాయవాదులు కోరారు. ఈ విషయమై ఏఏజీ మాత్రం అభ్యంతరం తెలిపారు.ప్రభుత్వమే చంద్రబాబుకు వైద్యం చేయిస్తుందని ఏఏజీ కోర్టు దృష్టికి తెచ్చారు. ఈ పిటిషన్ పై విచారణను లంచ్ బ్రేక్ తర్వాత చేపట్టనున్నట్టుగా ఏపీ హైకోర్టు తెలిపింది.
also read:సెక్యూరిటీపై అనుమానాలున్నాయన్న చంద్రబాబు: స్కిల్ కేసులో బాబు రిమాండ్ నవంబర్ 1 వరకు పొడిగింపు
ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబును ఏపీ సీఐడీ ఈ ఏడాది సెప్టెంబర్ 9వ తేదీన అరెస్ట్ చేసింది.ఈ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ ను ఏసీబీ కోర్టు కొట్టివేసింది. దీంతో ఏపీ హైకోర్టులో చంద్రబాబు తరపు న్యాయవాదులు బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు.