సెక్యూరిటీపై అనుమానాలున్నాయన్న చంద్రబాబు: స్కిల్ కేసులో బాబు రిమాండ్ నవంబర్ 1 వరకు పొడిగింపు
టీడీపీ చీఫ్ చంద్రబాబు రిమాండ్ ను ఈ ఏడాది నవంబర్ 1వ తేదీ వరకు రిమాండ్ ను గురువారం నాడు ఏసీబీ కోర్టు పొడిగించింది.
అమరావతి: టీడీపీ చీఫ్ చంద్రబాబు రిమాండ్ ను ఈ ఏడాది నవంబర్ 1వ తేదీ వరకు రిమాండ్ ను పొడిగిస్తూ గురువారంనాడు ఏసీబీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు రిమాండ్ ను పొడిగించాలని ఏపీ సీఐడీ తరపు న్యాయవాదులు కోరారు. దీంతో చంద్రబాబు రిమాండ్ ను నవంబర్ 1వ తేదీ వరకు పొడిగిస్తూ ఏసీబీ కోర్టు ఆదేశించింది.
ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు రిమాండ్ ఇవాళ్టితో పూర్తి కానుంది. దీంతో చంద్రబాబును వర్చువల్ గా ఏసీబీ కోర్టు ముందు చంద్రబాబును హాజరుపర్చారు అధికారులు. తన సెక్యూరిటీ విషయంలో అనుమానాలున్నాయని చంద్రబాబు ఏసీబీ కోర్టు దృష్టికి తెచ్చారు.తాను జడ్ ప్లస్ సెక్యూరిటీ ఉన్న వ్యక్తిని అని చంద్రబాబు ఏసీబీ కోర్టు జడ్జి దృష్టికి తీసుకువచ్చారు.
అయితే ఈ విషయమై రాతపూర్వకంగా ఇవ్వాలని ఏసీబీ కోర్టు జడ్జి సూచించారు. చంద్రబాబు రాసే లేఖను తనకు పంపాలని రాజమండ్రి జైలు అధికారులకు జడ్జి ఆదేశించారు.జైలు లోపల, బయట తన భద్రతపై కొన్ని అనుమానాలున్నాయని చంద్రబాబు జడ్జికి తెలిపారు.
ఆరోగ్యం గురించి అధికారులను అడిగారు ఏసీబీ జడ్జి.మెడికల్ రిపోర్టులు ఎప్పటికప్పుడు కోర్టుకు సమర్పించాలని అధికారులను ఏసీబీ కోర్టు జడ్జి ఆదేశించారు.తనకు ఆరోగ్యపరంగా ఉన్న ఇబ్బందిపడుతున్న విషయాన్ని చంద్రబాబు జడ్జి దృష్టికి తీసుకు వచ్చారు.చికిత్స చేసేందుకు వైద్యుల బృందం ఉన్న విషయాన్ని ఏసీబీ జడ్జి చంద్రబాబుకు చెప్పారు.చంద్రబాబు స్కిన్ సమస్యపై దృష్టి పెట్టాలని వైద్యులను ఏసీబీ కోర్టు ఆదేశించింది.
ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబును ఏపీ సీఐడీ అధికారులు ఈ ఏడాది సెప్టెంబర్ 9న అరెస్ట్ చేశారు. అప్పటి నుండి చంద్రబాబు జ్యుడీషీయల్ రిమాండ్ లో ఉన్నాడు. ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఏపీ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో చంద్రబాబు దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ పై తీర్పు రేపు వెలువడే అవకాశం ఉంది.